వేలంలో రూ.4.60కోట్లు పలికిన బూట్లు

Published : Aug 15, 2020, 12:20 PM ISTUpdated : Aug 15, 2020, 12:28 PM IST
వేలంలో రూ.4.60కోట్లు పలికిన బూట్లు

సారాంశం

గత మేలో ఇవే రకానికి చెందిన జోర్డాన్ బూట్లకు పలికిన  5లక్షల 60వేల అమెరికన్ డాలర్లు( సుమారు రూ.4.20కోట్లు) ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టినట్లు వేలం నిర్వహించిన క్రిస్టీ సంస్థ వెల్లడించింది.

బాస్కెట్ బాల్ దిగ్గజం మైకేల్  జోర్డాన్ వేసుకున్న బూట్లు వేలంలో  రికార్డు ధర పలికాయి. 1985లో ఇటలీ వేదికగా జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ లో జోర్డాన్ వేసుకున్న  ఎయిర్ జోర్డాన్ వన్ హైస్ స్నీకర్స్ షూస్ కు  6లక్షల 15వేల అమెరికన్ డాలర్లు( సుమారు రూ.4.60కోట్లు) లభించాయి. దాంతో గత మేలో ఇవే రకానికి చెందిన జోర్డాన్ బూట్లకు పలికిన  5లక్షల 60వేల అమెరికన్ డాలర్లు( సుమారు రూ.4.20కోట్లు) ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టినట్లు వేలం నిర్వహించిన క్రిస్టీ సంస్థ వెల్లడించింది.

అయితే ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించడానికి ఇష్టపడలేదు. నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఎన్‌బీఏ) టోర్నీలో మకుటం లేని మహారాజుగా నిలిచిన మైకేల్‌ జోర్డాన్‌... తనకే సాధ్యమైన ప్రత్యేక ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చికాగో బుల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన జోర్డాన్‌... తన జట్టు జెర్సీ కలర్‌ అయిన నలుపు, ఎరుపు రంగులతో కూడిన బూట్లను వాడేవాడు.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ