మెక్సికోలో కాల్పుల కలకలం..  బార్‌లో ఆరుగురి మృతి..

By Rajesh Karampoori  |  First Published Sep 17, 2023, 3:59 AM IST

మెక్సికోలోని ఓ బార్‌లో శుక్రవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మరణించారు. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుంది.


అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్‌లో తుపాకుల మోత మోగింది. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించగా.. పలువురి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ముఠా హింసతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతమని అధికారులు తెలిపారు. మెక్సికన్ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం అర్థరాత్రి టియోకల్టిచే పట్టణంలోని బార్‌లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారనీ, ఈ సమయంలో కొంతమంది దుండగులు తుపాకులు పట్టుకుని వచ్చి.. విచక్షణరహితంగా కాల్పలు జరిపారని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  మారావిల్లాస్ పరిసరాల్లోని బార్‌లో పలువురు వ్యక్తులు కాల్పులు జరిపారనీ, ఈ సంఘటనలో ఆరుగురు మరణించారని  పేర్కొంది. 

మెక్సికోలోని అతిపెద్ద క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌తో జాలిస్కో అల్లాడిపోయింది. జాలిస్కో రాజధాని గ్వాడలజారాకు ఉత్తరాన ఉన్న టియోకల్టిచే లో ఈ నెల ప్రారంభంలో మరో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. 2006 చివరిలో సమాఖ్య ప్రభుత్వం సైనిక మద్దతుతో మాదక ద్రవ్యాల వ్యతిరేక దాడిని ప్రారంభించినప్పటి నుండి.. 3,40,000 కంటే ఎక్కువ హత్యలు, దాదాపు 1,00,000 పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువ భాగం నేర సంస్థలతో ముడిపడి ఉన్నాయి.

Latest Videos


 

click me!