ఐదేళ్ల పాటు యుద్దం లేకుండా సంధిని ప్రతిపాదిస్తానన్న మెక్సికో అధ్యక్షుడు.. కమిషన్‌లో ప్రధాని మోదీ పేరు!

By Sumanth KanukulaFirst Published Aug 10, 2022, 5:55 PM IST
Highlights

అంతర్జాతీయ స్థాయిలో యుద్దాలు చోటుచేసుకోకుండా.. సంధిని ప్రోత్సహించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఐకరాజ్య సమితికి ప్రతిపాదనలు పంపనున్నట్టుగా మెక్సికన్ అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ చెప్పారు. అయితే ఈ కమిషన్‌ కోసం ముగ్గురు పేర్లను సూచించగా.. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉంది. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో యుద్దాలు చోటుచేసుకోకుండా.. సంధిని ప్రోత్సహించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఐకరాజ్య సమితికి ప్రతిపాదనలు పంపనున్నట్టుగా మెక్సికన్ అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ చెప్పారు. అయితే ఈ కమిషన్‌ కోసం ముగ్గురు పేర్లను సూచించగా.. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉంది. అయితే ఆ జాబితాలో ఉన్న రాజకీయ నాయకుడు కేవలం మోదీ మాత్రమే. ఎందుకంటే.. ఆ జాబితాలో మిగిలిన ఇద్దరిలో ఒకరు పోప్ ప్రాన్సిస్ కాగా,  మరోకరు యూఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్.

‘‘యుద్ధం, వాణిజ్య యుద్ధాలు లేకుండా ఐదేళ్ల ప్రపంచ సంధిని ప్రోత్సహించడానికి ముగ్గురు వ్యక్తులతో కూడిన కమిషన్‌ను రూపొందించడానికి UNకు వ్రాతపూర్వక ప్రతిపాదనను సమర్పించనున్నట్లు లోపెజ్ ఒబ్రాడోర్ సోమవారం ప్రకటించారు. ‘‘నేను ప్రతిపాదనను లిఖితపూర్వకంగా చేస్తాను.. నేను దానిని ఐక్యరాజ్యసమితికి అందజేస్తాను. నేను ఈ మాట చెబుతున్నాను. దీనిని వ్యాప్తి చేయడానికి మీడియా మాకు సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని లోపెజ్ ఒబ్రడార్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆ కమిషన్‌ను.. పోప్ ఫ్రాన్సిస్, UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భారత ప్రధాని నరేంద్ర మోడీలతో ఏర్పాటు చేయాలని అన్నారు. 

‘‘వారు ముగ్గురూ సమావేశమై త్వరలో ప్రతిచోటా యుద్ధాన్ని ఆపడానికి ఒక ప్రతిపాదనను అందజేస్తారు. కనీసం ఐదేళ్లపాటు సంధిని కోరేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలను ఆదుకోవడానికి పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యుద్ధం, వాటి ప్రభావాలతో చాలా బాధపడుతున్న వ్యక్తుల కోసం. మనకు ఐదు సంవత్సరాలు ఉద్రిక్తత లేకుండా, హింస లేకుండా.. శాంతితో ఉంటుంది’’ అనేదే దీని లక్ష్యమని చెప్పారు. 

లోపెజ్ ఒబ్రాడోర్ యుద్ధ చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. శాంతి కోసం మూడు ప్రపంచ శక్తులు చైనా, రష్యా మరియు యుఎస్‌లను ఆహ్వానించారు. ‘‘ఇది మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. యుద్ధం ఒక సంవత్సరంలోనే ప్రపంచ పరిస్థితిని మరింత దిగజార్చింది. నేడు ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందంటే వారే దీనికి కారణం. వారు ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యారు.. అవి ద్రవ్యోల్బణాన్ని, ఆహార కొరతను పెంచాయి. అన్నికంటే ముఖ్యంగా  మరింత పేదరికం పెరిగింది. చాలా మంది ప్రజలు ఒక సంవత్సరంలో సంఘర్షణలలో తమ జీవితాలను కోల్పోయారు’’ అని చెప్పారు. 

రష్యా, యునైటెడ్ స్టేట్స్, చైనా తాము ప్రతిపాదిస్తున్నటువంటి మధ్యవర్తిత్వాన్ని వింటాయని, అంగీకరిస్తాయని ఆశిస్తున్నట్టుగా లోపెజ్ ఒబ్రాడోర్ చెప్పారు. అదనంగా ఈ సంధి.. తైవాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో ఒప్పందాలను కుదుర్చుకోవడాని, ఘర్షణను ప్రోత్సహించకుండా సులభతరం చేస్తుందన్నారు. ఈ మూడు శక్తులకు చెందిన మూడు ప్రభుత్వాల సంకల్పం ఉంటేనే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు ఐక్యరాజ్యసమితికి మద్దతుగా చేరాలని అన్నారు.

click me!