సైనికుడి చేయి పట్టుకొని దగ్గరగా... ట్రంప్‌నకు దూరంగా: మెలానియా షాకింగ్

By narsimha lodeFirst Published Nov 13, 2020, 3:08 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ మధ్య దూరం పెరిగిందా.. వీరిద్దరూ విడాకులు తీసుకొంటున్నారా అనే చర్చకు ఊతమిచ్చేలా వెటరన్స్ డే సందర్భంగా  మెలానియా ట్రంప్ ప్రవర్తన దర్శనమిచ్చింది.


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ మధ్య దూరం పెరిగిందా.. వీరిద్దరూ విడాకులు తీసుకొంటున్నారా అనే చర్చకు ఊతమిచ్చేలా వెటరన్స్ డే సందర్భంగా  మెలానియా ట్రంప్ ప్రవర్తన దర్శనమిచ్చింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యాడు. అయితే ఓటమిని ట్రంప్ ఒప్పుకోవడం లేదు. ఎన్నికల్లో అనేక  అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు.

ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ వైట్ హౌస్ నుండి ఎక్కువగా బయటకు రావడం లేదు. వైట్ హౌస్ నుండి రెండుసార్లు మాత్రమే ఆయన బయటకు వచ్చాడు. ఈ రెండు దఫాలు కూడ ఆయన గోల్ఫ్ ఆడేందుకు మాత్రమే బయటకు వచ్చాడు.

ఈ నెల 12వ తేదీన వెటరన్స్ డేను పురస్కరించుకొని సతీసమేతంగా ట్రంప్ వైట్ హౌస్ నుండి బయటకు వచ్చాడు.అమెరికా ఆర్మీలో సేవలందించిన వారిని స్మరించుకొనేందుకు గాను ప్రతి ఏటా నవంబర్ 11వ తేదీన వెటరన్స్ డే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను మెలానియాతో కలిసి ట్రంప్ ఆర్లింగ్టన్ స్మశానవాటికకు చేరుకొన్నాడు.

ఫేస్ మాస్క్, సామాజిక దూరాన్ని పాటించకుండా మెలానియా ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా విచిత్రమేమిటంటే ఫేస్ మాస్క్ ధరించిన ఆర్మీ జవాన్ చేయి పట్టుకొని ఆమె నడిచారు. సైనికుడితో అతి దగ్గరగా ఆమె కలిసి నడిచారు.

ఆమెకు కొద్ది దూరంలో ట్రంప్ నడిచారు. ట్రంప్ కూడ ఫేస్ మాస్క్ కూడ ధరించలేదు.ఈ కార్యక్రమం పూర్తయ్యేవరకు మెలానియా సైనికుడికి దగ్గరగానే ఉంది. ట్రంప్‌నకు దూరాన్ని పాటించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కూడ ముఖానికి మాస్కులు ధరించారు. భౌతిక దూరం పాటించారు. ట్రంప్ కూతురు 
ఇవాంకా కూడ ఫేస్ మాస్క్ ధరించారు.

also read:విడాకులతో కళ్లు తిరిగే మొత్తాన్ని అందుకోబోతున్న మెలానియా..!

ట్రంప్, ఆయన భార్య మెలానియా విడాకులు తీసుకొంటారని ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలో ఆర్లింగ్టన్ స్మశానవాటికలో చోటు చేసుకొన్న ఘటనలు చర్చకు దారితీశాయి.

మెలానియా, ట్రంప్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని  ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలైన ఒమరోపా మానిగోల్డ్ న్యూమాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే..అయితే అమెరికా ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ట్రంప్ చేసిన ఆరోపణలను ఆదివారం నాడు మెలానియా సమర్ధించింది.

click me!