కంబోడియా కాసినోలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

Published : Dec 29, 2022, 12:34 PM IST
కంబోడియా కాసినోలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

సారాంశం

కంబోడియాలో పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్‌లో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు.

కంబోడియా : థాయ్‌లాండ్‌ సరిహద్దులోని కాంబోడియాన్‌ హోటల్‌ క్యాసినోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:30 గంటలకు పోయిపేట్‌లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ క్యాసినోలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 30 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియో ఫుటేజీలో భారీ కాంప్లెక్స్ మంటలు చెలరేగినట్లు కనిపిస్తుంది. కొన్ని క్లిప్‌లలో మంటలనుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి కాలిపోతున్న భవనం కిటికీల్లోంచి వ్యక్తులు దూకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. థాయ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిమీద మాట్లాడుతూ... స్థానిక అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నారని, గాయపడిన వారిని థాయ్‌లాండ్‌లోని సా కేయో ప్రావిన్స్‌లోని ఆసుపత్రులకు తరలించారని చెప్పారు.

మతిమరుపు...రోడ్ ట్రిప్ లో భార్యను మధ్యలో వదిలేసిన భర్త...!

"అధికారులు థాయ్ వైపు నుండి అగ్నిమాపక వాహనాలను పంపడం ద్వారా మంటలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు" అని వారు చెప్పారు. థాయ్ రెస్క్యూ ఆర్గనైజేషన్, రుయంకతన్యు ఫౌండేషన్‌కు చెందిన వాలంటీర్ మాట్లాడుతూ, మంటలు మొదటి అంతస్తులో ప్రారంభమైనప్పటికీ, కార్పెట్‌ల వెంట త్వరగా వ్యాపించాయని, బహుళ అంతస్తుల భవనం మొత్తం అంటుకుందని చెప్పారు. గ్రాండ్ డైమండ్ సిటీ థాయ్-కంబోడియన్ సరిహద్దులో ఉన్న అనేక క్యాసినో-హోటల్‌లలో ఒకటి.

 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే