ఘనాలో భారీ పేలుడు.. 17 మంది మృతి

By SumaBala BukkaFirst Published Jan 21, 2022, 6:33 AM IST
Highlights

 మొదట ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి.  అవి ట్రక్కును అంటుకున్నాయి  మంటల వ్యాప్తితో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. అయితే ఎంత మంది చనిపోయారు అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా చెప్పనప్పటికీ... స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు సంభవించిన తర్వాతి దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఘనా : ఆఫ్రికా దేశమైన Ghanaలో Huge explosion సంభవించింది.  ఈ దారుణ ఘటనలో 17 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డట్టు  తెలుస్తోంది. దీంతో వెంటనే వైద్య, పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘనాకు పశ్చిమ దిశలోని bogor cityలో ఈ పేలుడు సంభవించింది. Gold mineకి పేలుడు పదార్థాలను  తీసుకు వెళ్తున్న ట్రక్కును టూ వీలర్ ఢీ కొట్టింది. బంగారు గనులకు ఫేమస్ ఘనా.. ఇక్కడి గనుల్లో వేలాదిమంది కార్మికులు పనిచేస్తుంటారు. 

దీంతో మొదట ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి.  అవి ట్రక్కును అంటుకున్నాయి  మంటల వ్యాప్తితో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. అయితే ఎంత మంది చనిపోయారు అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా చెప్పనప్పటికీ... స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు సంభవించిన తర్వాతి దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయమని, దురదృష్టకరమైనదని ఆ దేశ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం హుతీలో వైమానిక దాడుల్లో 11 మంది మృతి చెందారు. సనా : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధానిపై తిరుగుబాటుదారులు సోమవారం జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా కొద్ది గంటల్లోనే Saudi Arabia సంకీర్ణ దళాలు.. Houthi తిరుగుబాటుదారుల ఆధీనంలోని Yemen రాజధాని సనాపై మంగళవారం వైమానిక దాడులు జరిపాయి. 

ఈ దాడుల్లో దాదాపు పదకొండు మంది మృతి చెందినట్లు సమాచారం.  దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 8 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి.  సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి లో యూఏఈ కూడా భాగస్వామి. వైమానిక దాడుల కారణంగా రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పదకొండు మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది...  అని స్థానికులు  తెలిపినట్లు ఓ వార్త సంస్థ పేర్కొంది. మృతుల సంఖ్యను వైద్య వర్గాలు ధ్రువీకరించాయి.  అబుదాబిపై తామే డ్రోన్,  క్షిపణి దాడులకు పాల్పడినట్లు  హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు గతంలోనూ సౌదీ అరేబియా సరిహద్దుల్లో పదే పదే దాడులకు పాల్పడ్డారు. అయితే సరిహద్దులు దాటి దాడి చేయడం ఇదే మొదటిసారి.  అమెరికా, ఇజ్రాయిల్ తదితర దేశాలు ఈ దాడులను ఖండించాయి. 

కాగా, అబుదాబి airportకు సమీపంలో సోమవారం నాడు జరిగిన drone దాడిలో ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు Indians సహా మరొకరు మరణించిన్టుగా అధికారులు తెలిపారు. అబుదాబిలోని ప్రధాన చమురు నిల్వకేంద్రానికి సమీపంలో చమురు ట్యాంకులను డ్రోన్ ద్వారా పేల్చివేయడతో ఇద్దరు భారతీయులు సహా ఒక pakistan వాసి మరణించారు. మరో ఆరుగురు గాయపడినట్టుగా స్థానిక మీడియా తెలిపింది.    ఈ దాడికి తామే బాధ్యులమని houthi ప్రకటించింది.

click me!