Boris Johnson: మాస్క్​ తప్పనిసరి కాదు.. క‌రోనా ఆంక్షల‌ను ఎత్తివేసిన బ్రిటన్​!

By Rajesh KFirst Published Jan 20, 2022, 12:45 PM IST
Highlights

Boris Johnson: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ గరిష్ఠస్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని బోరిస్​ తెలిపారు. బూస్టర్​ డోసుల పంపిణీ వేగవంతం చేయడం కారణంగానే.. ఒమిక్రాన్​ నుంచి బయటపడగలిగిన తొలి దేశంగా నిలిచిందని బోరిస్ వివరించారు. కోవిడ్ నిబంధనల పట్ల ప్రజల ప్రతిస్పందనను బట్టి.. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేశామని తెలియజేశారు.
 

Boris Johnson:  ప్ర‌పంచ దేశాల‌పై క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ స‌దుపాయాన్ని క‌ల్పించాయి. కోవిడ్ పాస్‌పోర్ట్, తప్పనిసరిగా మాస్క్ ధరించడం వంటి కీల‌క‌ మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ ఈ నిబంధనలను రెండేళ్ల నుంచి అమలు చేస్తున్నాయి.
బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.  ఒమిక్రాన్, కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేప‌ధ్యంలో గత నెలలో ఇంగ్లాండ్‌లో తిరిగి విధించిన ఆంక్షలను విధించి విష‌యం తెలిసిందే. 

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​..   తారా స్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పార‌ని ఆ దేశ ప్ర‌ధాని బోరిస్​ జాన్సన్​ తెలిపారు. ఇక దేశ‌వ్యాప్తంగా..క‌రోనా​ ఆంక్షలను మొత్తం ఎత్తివేసినట్లు ప్రకటించారు​. ఫేక్ మాస్క్ కూడా​ తప్పనిసరి కాద‌నీ , ఇతర కొవిడ్​ ఆంక్షలను స్వ‌స్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. ఇక ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం సదుపాయం కూడా ఉండదని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.

అలాగే, వచ్చే వారం నుంచి ఫేస్ మాస్క్, కోవిడ్ పాస్ కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ సోకినవారు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధనలకు రాబోయే వారాల్లో స్వ‌స్తీ ప‌లికినట్టు ప్ర‌క‌టించారు. మార్చి 24తో ఈ చట్టం గడువు ముగియనుండగా.. అంతకు ముందే రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్టు జాన్సన్ తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గాయని, అలాగే..  ఒమిక్రాన్ కేసులు కూడా గరిష్ఠాన్ని తాకడంతో నిబంధనలను సడలించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇక నుంచి తరగతి గదులలో మాస్క్ తప్పనిసరి నిబంధన ఉంద‌ని అన్నారు. రాబోయే రోజుల్లో సంరక్షణ కేంద్రాల్లోనూ నిబంధనలను సడలించనున్నట్టు స్పష్టం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ.. 36 మిలియన్ల కంటే ఎక్కువ బూస్టర్ డోసులు డెలివరీ చేయబడ్డాయ‌నీ, 60 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం మందికి ఇప్పుడు మూడవ డోస్ ఇవ్వబడిందనీ, అయితే రికార్డు కేసు రేట్లు చాలా వారాలుగా పడిపోయ‌ని తెలిపారు. 

అలాగే.. ఫ్లూ ఉన్న వారు కూడా  చట్టబద్ధంగా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదనీ, మనం కోవిడ్ కలిసి జీవించడానికి ఒక మార్గాన్ని అని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ తర్వాత తొలిసారిగా యూకేలో ఈవారం రోజువారీ కేసులు తక్కువగా నమోదయ్యాయి.గత ఏడాది వేసవిలో చాలా మంది వ్యతిరేకించినా దేశంలో కఠిన ఆంక్షలు విధించినట్లు బోరిస్ గుర్తు చేసుకున్నారు​. ఇప్పుడు ఇతర దేశాల్లో లాక్​డౌన్​ ఉన్నా.. త‌న దేశంలో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. 

అందుకే..  జీ-7 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్​ అవతరించిందని పేర్కొన్నారు.బూస్టర్​ డోసుల పంపిణీ వేగవంతం చేయడం కారణంగానే.. ఒమిక్రాన్​ నుంచి బయటపడిన తొలి దేశం తమదేనని యూకే ప్రధాని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, 1918లో సంభవించిన మహమ్మారి తర్వాత ఇదే అతి పెద్ద సవాలుగా అభివర్ణించారు బోరిస్ జాన్సన్.

click me!