దారుణం: వాల్‌మార్ట్ స్టోర్ లో కాల్పులు, 20 మంది మృతి

Published : Aug 04, 2019, 07:33 AM ISTUpdated : Aug 04, 2019, 08:23 AM IST
దారుణం: వాల్‌మార్ట్ స్టోర్ లో కాల్పులు, 20 మంది మృతి

సారాంశం

అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకొన్నాయి. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులకు దిగాడు. దీంతో 20 మంది మృతి చెందారు.

వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ నగరంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 వాల్‌మార్ట్ స్టోర్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి జొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో ఈ ఘటనలో గాయపడ్డారు. 

కాల్పులకు పాల్పడిన దుండగుడిని  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ మీడియాకు చెప్పారు. సాయుధుడైన నిందితుడు  స్టోర్స్ లో జొరబడి కాల్పులకు దిగినట్టుగా ప్రత్యక్షసాక్షులుతెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సాయుధులు కాల్పులు జరుపుతున్న సమయంలో ప్రాణాలు దక్కించుకొనేందుకు భయంతో పరుగులు తీస్తున్నట్టుగా ఆ దృశ్యాల్లో కన్పిస్తున్నాయి.

అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో 20 మంది మృతి చెందితే, మరో 26 మంది తీవ్రంగా గాయపడినట్టుగా స్థానిక అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?