గూఢచర్యం ఆరోపణలు: పాక్‌లో మరో భారతీయుడి అరెస్ట్

Siva Kodati |  
Published : Aug 02, 2019, 07:38 AM IST
గూఢచర్యం ఆరోపణలు: పాక్‌లో మరో భారతీయుడి అరెస్ట్

సారాంశం

తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణపై ఓ భారతీయుడిని పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. రాజు లక్ష్మణ్ అనే వ్యక్తిని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. 

బెలూచిస్తాన్ ప్రావిన్స్‌ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి ప్రవేశిస్తుండగా లక్ష్మణ్‌ను అరెస్ట్ చేశారు. తానో గూఢచారినని రాజు లక్ష్మణ్ ఒప్పుకున్నాడని... అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాజుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా గూఢచార్య ఆరోపణలపై భారత మాజీ నేవి అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాక్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?