Mario Draghi resign : ఇట‌లీ ప్రధాని పదవికి మారియో డ్రాగీ రాజీనామా.. ఎందుకంటే ?

Published : Jul 21, 2022, 03:42 PM ISTUpdated : Jul 21, 2022, 03:45 PM IST
Mario Draghi resign : ఇట‌లీ ప్రధాని పదవికి మారియో డ్రాగీ రాజీనామా.. ఎందుకంటే ?

సారాంశం

ఇట‌లీ ప్రధాని మారియో డ్రాగీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామను ఆ దేశ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లా ఆమోదించారు. అయితే కొత్త ప్రధాని ఎన్నికయ్యేంత వరకు ఆయనే తాత్కాలిక ప్రధానిగా కొనసాగనున్నారు. 

ఇటలీ ప్రధాని మారియో డ్రాగి తన ప‌ద‌వికి గురువారం రాజీనామా చేశారు. త‌న‌ రాజీనామ‌ ప‌త్రాన్ని అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు కు స‌మ‌ర్పించారు. దీంతో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రధానిగా కొనసాగాలని డాగ్రీని కోరారు. కొత్త ప్ర‌ధానిని ఎన్నుకునేంత వ‌ర‌కు అప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా కొన‌సాగాల‌ని సూచించారు. ఈ మేర‌కు అధ్య‌క్ష కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

Presidential Election Result: భారీ ఆధిక్యంలో ద్రౌపది ముర్ము.. ఆమెకు ఎంతమంది ఎంపీలు ఓటేశారంటే..

అయితే ఇట‌లీ అధ్యక్షుడు మట్టారెల్లా పార్లమెంట్‌ను రద్దు చేస్తారా లేదా ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తారా అనేది వెంటనే స్పష్టంగా తెలియరాలేదు. వాస్త‌వానికి మారియో డ్రాగీ గ‌త వార‌మే త‌న రాజీనామా చేశారు. ఇటలీ జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి రూపొందించిన ప్యాకేజీపై పార్లమెంటరీ విశ్వాస ఓటులో 5-స్టార్ ఉద్యమం తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ఆయ‌న గతంలోనే అధ్య‌క్షుడికి రాజీనామ పత్రాన్ని స‌మ‌ర్పించినా దానికి ఆమోదం ల‌భించ‌లేదు. 5-స్టార్‌లను చేర్చని ప్రభుత్వానికి తాను నాయకత్వం వహించనని డ్రాగీ గతంలో చెప్పాడు.

కాగా.. ఆయ‌న ప్ర‌భుత్వం పూర్తి ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేయడానికి ఇంకా స‌మ‌యం ఉంది. అయితే యూరోపియన్ యూనియన్ నిధులతో కూడిన COVID-19 మహమ్మారి పునరుద్ధరణ కార్యక్రమం అమలును నిర్ధారించడానికి ఐక్యంగా ఉండాలనే అతని విజ్ఞప్తిని లెఫ్ట్, రైట్, ప్రజావాదులతో కూడిన ఆయ‌న సంకీర్ణ ప్ర‌భుత్వంలోని స‌భ్యులు విస్మ‌రించారు. దీంతో డ్రాగీ ప్రభుత్వం గురువారం సంక్షోభంలో ప‌డింది. కీలకమైన సంకీర్ణ భాగస్వాములు విశ్వాస ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణ‌యించుకున్న త‌రువాత డాగ్రీ రాజీనామా చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !