తన ప్రేయసి కోరిక మేరకు మీసాలు, గడ్డాలకు రంగు వేసుకున్నాడు. చాలా సేపు అలానే ఉంచుకున్నాడు. అయితే.. ఆ రంగు అతని చర్మానికి పడలేదు.
ప్రస్తుత కాలంలో స్టైలిష్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు. అందుకోసం విభిన్న హెయిర్ స్టైల్స్ ట్రై చేయడం.. లేదంటే.. వివిధ రకాల రంగులు వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే.. తన బాయ్ ఫ్రెండ్ కూడా ట్రెండీగా ఉండాలని ఓ యువతి ఆశపడింది. వెంటనే.. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పేసింది.
గర్ల్ ఫ్రెండ్ కోరిక కాదు అనలేక వెంటనే.. తన గడ్డానికి , మీసానికి రంగు వేసుకున్నాడు. అయితే.. ఆ తర్వాత తన ముఖమే మారిపోతుందని ఆ వయుకుడు ఊహించలేకపోయాడు. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలోని వెంబర్ బిజల్ పార్క్ ప్రాంతానికి చెందిన మార్నో అనే యువకుడు.. తన ప్రేయసి కోరిక మేరకు మీసాలు, గడ్డాలకు రంగు వేసుకున్నాడు. చాలా సేపు అలానే ఉంచుకున్నాడు. అయితే.. ఆ రంగు అతని చర్మానికి పడలేదు.
దీంతో కెమికల్ బర్న్ జరిగింది. ఫలితంగా అతనికి చర్మంపై ఎంతో మంటగా అనిపించింది. ఈ ఎలర్జిక్ రియాక్షన్ కారణంగా అతని ముఖంలోని డై వేసిన భాగమంతా ఎర్రగా మారిపోయింది. ఇంతేకాదు ముఖం, గొంతు, పెదాలు బాగా వాచిపోయాయి. ఈ చర్మ సమస్యల నివారణకు మార్నో నెల్లాళ్లపాటు ఔషధాలు వాడాల్సివచ్చింది. కాగా.. తన అనుభవాన్ని మార్నో ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వైరల్ గా మారింది.