
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ బాట పడుతున్నారు. అయితే.. 60ఏళ్ల లోపు వారికి మాత్రం ఆక్సఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వకూడదంటూ ఇటలీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల ఈ టీకాను ఓ టీనేజర్ కి ఇవ్వగా.. రక్తం గడ్డకట్టి అతను మరణించాడని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటలీ ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ కారణంగానే టీనేజర్ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.
అత్యంత అరుదుగా మాత్రమే సంభవించే ఈ రుగ్మత కారణంగా ఆ టీనేజర్ మే 25న మృతి చెందాడు. మరోవైపు.. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు కింద మరో టీకా ఇస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా టీకా కారణంగా రక్తం గడ్డకడుతాయన్న అనుమనాంతో ముందుగా జాగ్రత్తగా పలు దేశాలు ఈ టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ జాబితాలోకి తాజాగా ఇటలీ కూడా వచ్చి చేరింది.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona