పక్కింటి మహిళను చంపి.. ఆమె గుండెను ఆలుగడ్డ కూరలో వేసి వండి.. కుటుంబసభ్యులకు వడ్డించి.. చివరికి..

By SumaBala BukkaFirst Published Mar 17, 2023, 2:08 PM IST
Highlights

అమెరికాలో ఓ వ్యక్తి పక్కింటి మహిళను చంపి.. ఆమె గుండెతో ఆలుగడ్డ కూర వండి ఇంట్లో వాళ్లకు పెట్టాడు. ఆ తరువాత వారిని కూడా దారుణంగా హతమార్చాడు. 

అమెరికా : ఓ వ్యక్తి చేసిన దారుణమైన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మాజీ నేరస్తుడైన ఆ వ్యక్తి తన పక్కింటి మహిళను చంపి, ఆమె గుండెను కోసి..దాన్ని తనింట్లోని వారికి వండిపెట్టాడు. అది తిన్న తరువాత వారిని కూడా కత్తితో నరికి చంపాడు. ఘటన గురించి చదువుతుంటేనే కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా ఉంది కదా.. మనుషుల్లో ఇంత రాక్షసత్వం ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే ఉంది.. దయ్యాల నుంచి తప్పించుకోవడానికి అలా చేశానని ఆ వ్యక్తి చెప్పడం కొస మెరుపు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. అమెరికాలోని ఓక్లహోమా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది వెలుగులోకి రావడంతో సదరు నిందితుడికి జీవిత ఖైదు విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ది ఇండిపెండెంట్ ప్రకారం, 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ 2021లో భయంకరమైన హత్యలకు పాల్పడ్డాడు. అరెస్టై జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల అతను జైలునుంచి ముందస్తుగా విడుదల అయ్యాడు.

కొరియన్ అమ్మాయిలే టార్గెట్.. డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..

విడుదలైన నెల రోజుల్లోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విడుదలైన కొన్ని వారాలకు తనింటి పక్కనుండే ఆండ్రియా బ్లాంకెన్‌షిప్ అనే మహిళను హత్య చేశాడు. ఆ తరువాత ఆమె గుండెను కోసి.. ఇంటికి తెచ్చాడు. దాన్ని ముక్కలుగా కోసి, ఆలుగడ్డల్లో వేసి కూర వండాడు. ఆ కూరను తన అత్త, మామ.. వారి 4యేళ్ల మనవరాలికి వండించాడు. ఈ విషయాలేమీ వారికి తెలియవు. ఆ తరువాత వారిమీద కూడా పాల్ దాడికి దిగాడు. 

ఈ దాడిలో పాల్ మామ 67 ఏళ్ల లియోన్ , అతని 4 ఏళ్ల మనవరాలు కేయోస్ యేట్స్‌ను తీవ్రమైన కత్తి పోట్లతో అక్కడి కక్కడే మరణించారు. అత్త డెస్లీ మాత్రం గాయాలతో తప్పించుకుంది. కత్తితో పొడిచి చంపడానికి ముందు అతను ఆ ముగ్గురికి భయంకరమైన భోజనాన్ని వడ్డించడానికి ప్రయత్నించాడని స్థానిక మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. 

అండర్సన్‌కు ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ క్షమాభిక్షతో జైలునుంచి బయటికి వచ్చారు. ఆ సమయానికి అతను మాదకద్రవ్యాల కేసులో 20 సంవత్సరాల శిక్షను అనుభవిస్తున్నాడు. అందులో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పూర్తయ్యింది. అయితే, ఈ ఘటన తరువాత పోలీసుల దర్యాప్తులో అండర్సన్ పేరు పొరపాటున విడుదలయ్యే ఖైదీల జాబితాలో చేరిందని తేలింది. 

ముగ్గురిని అతి కిరాతకంగా చంపేసిన తరువాత అండర్సన్ అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో దెయ్యాల నుంచి కాపాడుకోవడానికే ఇలా చేశానని వింత సమాధానాలు చెప్పాడు. అయితే, కుటుంబసభ్యులనెందుకు చంపావని అడిగితే మాత్రం సమాధానం లేదు. దీంతో అతను డ్రగ్స్ మత్తులో హత్యలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే, అతనికి గతనేరచరిత్రతో పాటు, మానసిక స్తితి కూడా సరిగా లేదని పోలీసులు తెలిపారు. 

ఈ కేసులో అండర్సన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిమీద మోపిన హత్య, దాడి నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనికి వరుసగా ఐదు జీవిత ఖైదులు విధించారు. దాడిలో గాయపడిన అండర్సన్ అత్త, ఇతర బాధిత కుటుంబాలు ఓక్లహోమా గవర్నర్, జైలు పెరోల్ బోర్డుపై కేసులు పెట్టాయి.

click me!