Viral Video: రియల్ హీరో... ఐదో అంతస్తు నుంచి జారి పడ్డ చిన్నారిని క్యాచ్ పట్టుకొని...!

Published : Jul 23, 2022, 01:49 PM IST
Viral Video: రియల్ హీరో... ఐదో అంతస్తు నుంచి జారి పడ్డ చిన్నారిని క్యాచ్ పట్టుకొని...!

సారాంశం

అక్కడ ఏం జరుగుతోంది అనే విషయం అర్థం కాగానే.. అతను వెంటనే అక్కడకు పరిగెత్తాడు. అతనితో పాటు.. ఆయన భార్య కూడా అక్కడకు పరుగు తీసింది.  

అపార్ట్మెంట్ లో ఫ్లై ఫ్లోర్ నుంచి ఎప్పుడైనా కిందకు తొంగి చూసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా..? ఒకసారి చూస్తే.. కళ్లు తిరిగినంత పని అవుతుంది. అలాంటిది అక్కడి నుంచి పొరపాటున జారి కింద పడితే ఎంకేమైనా ఉందా..? తలుచుకుంటుంటూనే పై ప్రాణాలు పైకి పోతున్నాయి కదా. అక్కడి నుంచి జారి పడితే.. కనీసం బతుకుతామనే గ్యారెంటీ కూడా ఉండదు. కానీ ఓ చిన్నారి మాత్రం చిన్న గాయం లేకుండా బతికి బయటపడింది. అందుకు కారణం ఓ వ్యక్తి రియల్ హీరోలా.. ఆ పాపను క్యాచ్ పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఘటన చైనాలో చోటుచేసుకోగా.. ఎప్పుడు జరిగింది అనే విషయంలో పెద్దగా క్లారిటీ లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే... షేన్ డాంగ్ అనే వ్యక్తి తన కారును పార్క్ చేసి వస్తుండగా... పక్కనే ఉన్న ఓ బహుళ అంతస్తు నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. అక్కడ ఏం జరుగుతోంది అనే విషయం అర్థం కాగానే.. అతను వెంటనే అక్కడకు పరిగెత్తాడు. అతనితో పాటు.. ఆయన భార్య కూడా అక్కడకు పరుగు తీసింది.

 

కరెక్ట్ గా వారు నిలపడిన ప్లేస్ లోకి ఐదో అంతస్తు నుంచి ఓ చిన్నారి కిందకు జారి పడటం గమనార్హం. అతను వెంటనే ఓ బంతిని క్యాచ్ పట్టినట్టుగా.. ఆ చిన్నారిని పట్టుకున్నాడు. అంతే.. ఆ చిన్నారి ప్రాణాలతో బతికి బయట పడింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోని రియల్ హీరో అంటూ.. ఓ వ్యక్తి  సోషల్ మీడియాలో షేర్ చేయగా...  వీడియో వైరల్ గా మారింది.

దీంతో... ఆయనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సమాయానికి అతను పట్టుకోకపోతే పాప బతికేది కాదని కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?