‘‘కూర్చునే ముందు టాయ్ లెట్ లోకి ఒకసారి తొంగి చూడండి’’

Published : Jul 24, 2018, 11:31 AM IST
‘‘కూర్చునే ముందు టాయ్ లెట్ లోకి ఒకసారి తొంగి చూడండి’’

సారాంశం

రోజులాగే జేమ్స్ హూపర్ టాయ్ లెట్ కి వెళ్లగా.. అందులో అతనికి పాము కనపడిందట. ముందు ఇంటి సభ్యులు ఎవరైనా ప్రాంక్ చేయడానికి ఏదైనా బొమ్మ పెట్టారేమో అని భావించాడు. కానీ.. అది కదలడం చూసేసరికి నిజమైన పాము అని అర్థమైంది. దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది వైరల్ గా మారింది.  

మీరు టాయ్ లెట్ కి వెళ్లినప్పుడు.. కాస్త చూసి కూర్చోండి’’ ఈ మాట మేము చెప్పడం లేదండి. జేమ్స్  హూపర్ అనే వ్యక్తి చెబుతున్నాడు. ఎందుకంటే.. ఆయనకు ఓ వింత సంఘటన ఎదురైంది. అలాంటి సంఘటన మీకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందేమోనని ముందు జాగ్రత్తతో చెబుతున్నాడు. ఇంతకీ ఆయనకు ఎదురైన సంఘటన ఎంటో తెలుసా..? టాయ్ లెట్ లో పాము కనపడింది.

రోజులాగే జేమ్స్ హూపర్ టాయ్ లెట్ కి వెళ్లగా.. అందులో అతనికి పాము కనపడిందట. ముందు ఇంటి సభ్యులు ఎవరైనా ప్రాంక్ చేయడానికి ఏదైనా బొమ్మ పెట్టారేమో అని భావించాడు. కానీ.. అది కదలడం చూసేసరికి నిజమైన పాము అని అర్థమైంది. దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది వైరల్ గా మారింది.

టాయ్ లెట్ లోని పాముని జేమ్స్ బయటకు తీసి బకెట్ లోకి వదిలిపెట్టారు. ఆ తర్వాత దానిని సురక్షితంగా బయటకు విడుదల పెట్టారు. అయితే.. టాయ్ లెట్ లోకి అసలు పాము ఎలా వచ్చింది అన్న విషయం మాత్రం అర్థం కాలేదని అతను చెబుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

Ciel Tower : సామాన్యులకు అందనంత ఎత్తు.. ఈ హోటల్‌లో ఒక్క రోజు గడపాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనా?
VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే