ఇదేం పనిరా బాబు.....బొద్దింకను చంపబోయి సొంత ఇంటినే తగలబెట్టేశాడు..

By SumaBala BukkaFirst Published Dec 16, 2023, 6:48 AM IST
Highlights

ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్‌లో ఒక బొద్దింకను చూశాడు. దానిని చంపడానికి పెద్ద మొత్తంలో పురుగుల మందు పిచికారీ చేయడంతో ఈ సంఘటన జరిగింది.

జపాన్ : బొద్దింక.. ఇంట్లో ఇది కనబడితే తరిమేవరకు మనశ్శాంతి ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఓ దగ్గరినుంచి బొద్దింకలు వస్తూనే ఉంటాయి. లక్ష్మణ్ రేఖలు, స్ప్రేలు, పిచికారీలు, పెస్ట్ కంట్రోల్ లు ఇలా అనేక రకాలుగా వాటిని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాగే చేయబోయాడో వ్యక్తి కానీ, తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

బొద్దింకను చంపే ప్రయత్నంలో ఇంటినే పేల్చేశాడు. జపాన్‌లో ఓ వ్యక్తి బొద్దింకను చంపేందుకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అతని అపార్ట్‌మెంట్‌లో పేలుడు జరిగింది. అనుకోని ఈ పరిణామానికి అతను షాక్ అయ్యాడు. పేలుడుధాటికి కిటికీ ఊడిపోయింది అతనికి స్వల్ప గాయాలయ్యాయి. జపనీస్ వార్తాపత్రిక మైనిచి షింబున్‌లోని ఒక నివేదిక ప్రకారం, డిసెంబర్ 10 అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది, 54 ఏళ్ల వ్యక్తి కుమామోటో చువో తన అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చూశాడు. దీంతో దాన్ని ఎలాగైనా చంపాలనుకున్నాడు. దీనికోసం పెద్ద మొత్తంలో పురుగుమందును పిచికారీ చేశాడు. 

Ayodhya Ram Mandir Inauguration : ఇంట్లో ఐదు దీపాలు వెలిగించనున్న ఇండో అమెరికన్లు...

పేలుడు ధాటికి బాల్కనీ కిటికీ ఊడిపోవడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. పరిశోధన సమయంలో, నివేదిక ప్రకారం, "కోటాట్సు" హీటింగ్ టేబుల్ దగ్గర కాలిన గుర్తులు కనుగొనబడ్డాయి. జపాన్ నేషనల్ కన్స్యూమర్ అఫైర్స్ సెంటర్ అటువంటి పేలుళ్ల గురించి గతంలో కూడా అనేక నివేదికలు వచ్చాయి. అనేక పెస్ట్ రిమూవల్ కంపెనీల ప్రకారం.. ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌ల దగ్గర పురుగుమందులను పిచికారీ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తత్ఫలితంగా ప్రజలు గాయపడతారని ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లోని ఒక నివేదిక పేర్కొంది, 

అనేక క్రిమిసంహారకాలలో ఆల్కహాల్‌తో పాటు మండే పదార్థాలు అనేకం ఉంటాయి. ప్రొపేన్, బ్యూటేన్‌తో సహా ప్రొపెల్లెంట్‌లు కూడా ఈ క్రిమిసంహారక పిచికారీలలో ఉంటాయి. ఒక గదిలో ప్రొపెల్లెంట్లు, ఆక్సిజన్ ఖచ్చితమైన మిశ్రమం ఉంటే, పేలుడు జరిగే అవకాశం ఉందని సింగపూర్ వార్తాపత్రిక పేర్కొంది.

click me!