పాకిస్తాన్‌లో దారుణం.. పిల్లల ముందే తల్లిని పెద్ద కడాయిలో ఉడికించిన తండ్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Published : Jul 14, 2022, 11:56 PM IST
పాకిస్తాన్‌లో దారుణం.. పిల్లల ముందే తల్లిని పెద్ద కడాయిలో ఉడికించిన తండ్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సారాంశం

పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. భార్యను ఇతరులతో కలువాలని భర్త వేధించాడు. కానీ, ఆమె తిరస్కరించింది. దీంతో ఆమెను పిల్లల ముందే దారుణంగా హతమార్చాడు. దిండుతో ఊపిరాడకుండా చేసి కిచెన్‌లో పెద్ద కడాయిలో ఉడికించాడు.  

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను పిల్లల ముందే పెద్ద కడాయిలో ఉడికించిన ఘటన చోటుచేసుకుంది. వేరే వారితో శారీరకంగా కలువాలని తన భార్యను భర్త ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అందుకు ససేమిరా అనడంతో భార్యపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

నర్గిస్, ఆషిక్‌లు భార్య భర్తలు. వీరికి ఆరుగురు పిల్లలు. లబజౌర్ ఏజెన్సీకి చెందిన ఆషిక్ ఓ స్కూల్‌లో వాచ్‌మ్యాన్‌గా చేస్తున్నాడు. అదే స్కూల్‌లో సర్వెంట్ క్వార్టర్స్‌లో ఈ దంపతులు ఉంటున్నారు.

కొన్నాళ్ల నుంచి తన భార్యను ఇతరులతో శారీరకంగా కలువాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. కానీ, అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో భర్త ఆషిక్.. తన భార్య నర్గిస్‌పై దాడికి దిగినట్టు తెలుస్తున్నది. దిండుతో ఊపిరి ఆడకుండా చేసినట్టు పోలీసులు ఊహిస్తున్నారు. ఆ తర్వాత ఆమెను ఓ పెద్ద కడాయిలో వేసి ఉడికించినట్టు వివరించారు. వారి పిల్లల ముందే భర్త.. ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. 

ఆ తర్వాత ఆషిక్ తన ముగ్గురు పిల్లలతో పారిపోయాడు. మరో ముగ్గురు అక్కడే ఉన్నారు. నర్గీస్‌, ఆషిక్‌ల 15 ఏళ్ల కూతురు పోలీసులకు ఈ సమాచారం అందించింది. పోలీసులు పరుగున స్పాట్‌కు చేరుకున్నారు. గుల్షన్ ఇ ఇక్బాల్ ఏరియాలోని ఓ ప్రైవేట్ స్కూల్ కిచెన్ రూమ్‌లో ఓ పెద్ద కడాయిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. జిల్లా ఈస్ట్ సీనియర్ ఎస్పీ అబ్దుర్ రహీం షెరాజీ ఆ ముగ్గురు పిల్లలను కస్టడీలోకి తీసుకున్నట్టు వివరించారు. వారంతా మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. 

ఆ మహిళ డెడ్ బాడీని జిన్నా పీజీ మెడికల్ సెంటర్‌కు తరలించినట్టు వివరించారు. మెడికో లీగల్ పార్మాలిటీల కోసం ఆ మృతదేహాన్ని అక్కడకు తరలించారు. ఆ మహిళ కాలు కూడా నరికేసినట్టు తెలిసింది.

అసలు ఈ నేరం పాల్పడటానికి గల కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు వివరించారు. అయితే, ఆ భర్త తన భార్యను ఇతర పురుషులతో కలువాలని ఒత్తిడి చేశారనే వదంతులు స్థానికంగా  ఉన్నాయి. ఆమె తిరస్కరించడం కారణంగానే చంపేసినట్టు కొందరు స్థానికులు భావిస్తున్నారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడానికి తనిఖీలు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !