
ఒక కాన్పులో కవలలు జన్మిస్తే ఎంతో స్పెషల్ గా చూస్తారు. అలా కాకుండా.. ముగ్గురు లేదా నలుగురు పుడితే.. ఇంక చెప్పాల్సిన పనిలేదు. అమ్మ బాబోయ్ అని ఆశ్చర్యపోతారు. అలాంటిది ఓ మహిళ ఏకంగా ఒక కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. ఈ సంఘటన మాలీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మాలికి చెందిన హలీమా సిస్సీ(25) అనే మహిళ మంగళవారం 9మంది సంతానానికి జన్మనిచ్చింది. కాగా.. ఆమెకు డెలివరీ చేయడానికి దాదాపు ముగ్గురు డాక్టర్లు సహకరించడం గమనార్హం. మొత్తం 9మంది జన్మించగా.. వారిలో ఐదుగురు అమ్మాయిలు.. నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఫాంటా సీబీ ప్రకటించారు.
స్కానింగ్ సమయంలోనే ఎక్కువ మంది సంతానంఉన్నారని తెలుసట. అయితే.. ఏడుగురు సంతానం అని అనుకున్నారట. కానీ ఏకంగా తొమ్మిది మంది పుడతారని ఊహించలేదని సదరు మహిళ పేర్కొన్నారు.
తల్లి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. బిడ్డలు పూర్తి ఆరోగ్యంగా లేరని పేర్కొన్నారు. తొమ్మిది మంది కావడంతో.. వారిలో కొందరు పూర్తిగా ఏర్పడలేదని.. బలహీనంగా ఉన్నారని చెప్పారు. కాగా.. ఈ ఘటన అందరినీ షాకింగ్ కి గురిచేసింది. ఇలా ఒకే కాన్పులో ఇంత మంది చిన్నారులు జన్మించడం చాలా అరుదుగా జరుగుతుంది.