పేకాటలో 4 మిలియన్ పౌండ్లు పోగొట్టుకున్న బిజినెస్ మ్యాన్.. కేసినోపై దావా.. ఆపకుండా.. అప్పులిచ్చి మరీ...

Published : Jan 29, 2022, 11:31 AM IST
పేకాటలో 4 మిలియన్ పౌండ్లు పోగొట్టుకున్న బిజినెస్ మ్యాన్.. కేసినోపై దావా.. ఆపకుండా.. అప్పులిచ్చి మరీ...

సారాంశం

ఈ సొమ్మును ఆయన చెల్లించకపోవడంతో ఆ కేసినో ఆయనపై దావా వేసింది. ఈ కేసినో 2019లో విజయం సాధించింది.  4  కోర్ట్ ఆర్డర్స్ ధిక్కరించినందుకు ఆయనకు లక్ష పౌండ్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గ్యాంబ్లింగ్ యాక్ట్, 2005 ప్రకారం నిర్వహించవలసిన బాధ్యతలను ఆస్పినల్స్ కేసినో నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు.  

లండన్ : ఆస్పినల్స్ కేసినోలో card game ఆడి, దాదాపు 3.9 మిలియన్ పౌండ్లు నష్టపోయిన malaysian businessman హాన్ జోయెహ్ లిమ్ ఆ కేసినోపై దావా వేశారు. తాను నష్టాల బాటలో పయనిస్తున్న సమయంలో తనకు నచ్చజెప్పి, ఆట నుంచి తప్పుకునేలా ఎందుకు చేయలేకపోయారు అని ఆ casinoను నిలదీశారు.

హాన్ (62)కు 40 మిలియన్ పౌండ్ల సంపద ఉంది. londonలో కూడా  ఆయనకు ఆస్తులు ఉన్నాయి. 2014లో ఆయన ఈ కేసినోలో సభ్యులుగా చేరారు. ఆరు లక్షల పౌండ్ల క్యాష్ చెక్స్ ఇచ్చేందుకు ఆయనకు అనుమతి ఉంది. 2015లో కార్డు గేమ్ ఆడినప్పుడు ఈ పరిమితి దాటిపోయిన తర్వాత ఆయన క్రెడిట్ పరిమితిని 1.9 మిలియన్ పౌండ్లకు ఆ కేసినో పెంచింది.  అది కూడా నష్టపోయిన తర్వాత మరో రెండు మిలియన్ పౌండ్ల క్రెడిట్ను అనుమతించింది. దీనిని కూడా ఆయన నష్టపోయారు.

ఈ సొమ్మును ఆయన చెల్లించకపోవడంతో ఆ కేసినో ఆయనపై దావా వేసింది. ఈ కేసినో 2019లో విజయం సాధించింది.  4  కోర్ట్ ఆర్డర్స్ ధిక్కరించినందుకు ఆయనకు లక్ష పౌండ్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గ్యాంబ్లింగ్ యాక్ట్, 2005 ప్రకారం నిర్వహించవలసిన బాధ్యతలను ఆస్పినల్స్ కేసినో నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు.  

తనకు 3.9 మిలియన్ పౌండ్లు చెల్లించాలని ఆదేశించాలని కోర్టును కోరారు.  జూదంలో దెబ్బతినకుండా, దోపిడీకి గురికాకుండా బలహీనులను కాపాడాలని ఈ చట్టం చెబుతోందన్నారు. జూదంలో నష్టపోయిన దానిని మళ్లీ రాబట్టుకోవడం కోసం ప్రయత్నించడాన్ని ఈ కేసినో సానుకూలంగా మలుచుకుందని ఆరోపించారు.

మరింత ఎక్కువ సమయం జూదం ఆడటానికి అవకాశం ఇవ్వడంతో పాటు అదనపు నిధులను కూడా అనుమతించిందని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమైన తెలిపారు. ఈ దావాను రద్దు చేయాలని కేసినో తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !