మహిళలు ఎక్కువ తాగుతున్నారు.. అందుకే సంతానం కలుగడం లేదు: పోలాండ్ నేత వివాదాస్పదం

By Mahesh KFirst Published Nov 8, 2022, 1:44 PM IST
Highlights

మహిళలు ఎక్కువగా తాగుతున్నారని, అందువల్లే దేశంలో జననాల రేటు పడిపోతున్నదని అధికార పార్టీ నేత జరోస్లా కాక్జిన్‌స్కీ అన్నారు. మరో 25 ఏళ్లలో పురుషులకు సమానంగా మహిళలూ తాగితే ఇక జననాలే ఉండబోవని తెలిపారు.
 

న్యూఢిల్లీ: పోలాండ్ అధికార పార్టీ నేత జరోస్లా కాక్జిన్‌స్కీ సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలాండ్‌లో జననాల రేటు పడిపోవడానికి కారణం మహిళలే అని ఆరోపించారు. వారు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని, అందుకే జననాలు పడిపోతున్నాయని తెలిపారు. దేశ జననాల రేటు తగ్గిపోవడానికి కారణం యువతుల ఎక్కువగా తాగడమే అని చెప్పారు. 

ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సమాజం నుంచి చాలా వర్గాల నుంచి ఈయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఆయన వ్యాఖ్యలు నాన్‌సెన్స్ అని అంటున్నారు. అలాగే, పితృస్వామ్యానికి నిదర్శనంగా ఈ కామెంట్లు ఉన్నాయని వివరించారు.

మహిళలు ఎక్కువగా తాగుతున్నారని, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే 25 ఏళ్లలో పురుషులకు సమానంగా మహిళలూ తాగితే గనక ఇక జననాలే ఉండబోవని ఆయన అన్నారు. అలాగే, పురుషుల కంటే మహిళలు తొందరగా ఆల్కహాల్‌కు బానిసలు అవుతారని వివరించారు. పురుషులు తాగుబోతులుగా మారడానికి 20 ఏళ్లు పడుతాయని, అదే మహిళలు తాగుబోతులు కావడానికి కేవలం రెండే సంవత్సరాలు పడుతాయని తెలిపారు.

Also Read: ఆమెకు 83.. అతడికి 28 ఎనిమిది.. ఫేస్ బుక్ కలిపింది.. దేశాలు దాటి వచ్చి మరీ పెళ్లాడింది..

తాను ఓ వైద్యుడి అనుభవం నుంచే ఈ వ్యాఖ్యలు చేస్తున్నా అని అన్నారు. తాను క్యూర్ చేసిన పురుషుల్లో మూడొంతుల మందికి నయం చేశారని వివరించారు. కానీ, ఒక మహిళను క్యూర్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడని తెలిపారు.

click me!