465 రోజుల కింద సముద్రంలో పోగొట్టుకున్న ఫోన్ మళ్లీ చిక్కింది.. వర్కింగ్ కండీషన్‌లోనే ఉందన్న యూజర్

By Mahesh KFirst Published Nov 24, 2022, 7:56 PM IST
Highlights

ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మహిళ సముద్రంలో ప్యాడల్ బోర్డుపై ఈదడానికి వెళ్లింది. అదే సమయంలో ఫోన్ సముద్రంలో మిస్ అయింది. మళ్లీ ఆ ఫోన్ 465 రోజుల తర్వాత తిరిగి తన వద్దకు వచ్చేసింది. అన్ని రోజులూ నీట మునిగే ఉన్నప్పటికీ ఆ ఫోన్ మంచి వర్కింగ్ కండీషన్‌లో ఉండటం గమనార్హం.
 

న్యూఢిల్లీ: సముద్రంలో ప్యాడల్‌బోర్డుపై ఈదుతూ ఆమె వెళ్లింది. నీటిలో దూకి మళ్లీ ఆమె బోర్డుపైకి రాగానే మెడలో ఉన్న ఫోన్ కనిపించకుండా పోయింది. సముద్రంలో పోయిన ఆ ఫోన్ మళ్లీ దొరుకుతుందని ఆమె ఊహించలేదు. అలాంటి ఆశలు లేకుండానే మరో ఫోన్ కొనుక్కుని అడ్జస్ట్ అయింది. పోయిన ఫోన్‌ను దాదాపు ఆమె మరిచింది. కానీ, 465 రోజుల తర్వాత అంటే ఏడాది కంటే కూడా ఎక్కువ కాలం గడిచిన తర్వాత ఆ ఫోన్ మళ్లీ ఆమెకు లభించింది. అది కూడా వర్కింగ్ కండీషన్‌లో లభించడం గమనార్హం. తన ఐఫోన్ 8 ప్లస్ ఫోన్ వర్కింగ్ కండీషన్‌లోనే ఉన్నదని ఆమె తెలిపింది.

యాహూ న్యూస్ ప్రకారం, ఇంగ్లాండ్‌కు చెందిన 39 ఏళ్ల క్లేర్ ఎట్‌ఫీల్డ్ హాంప్‌షైర్‌లోని హవంత్ తీరంలో సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. గతేడాది ఆగస్టు 4న వెళ్లారు. ఆ సమయంలో మెడలో ఈ ఫోన్‌ను వేసుకుంది. కానీ, ఆమె సముద్రంలో జంప్ చేసి మళ్లీ ప్యాడల్ బోర్డు ఎక్కగానే మెడలో నుంచి ఫోన్ జారి సముద్రంలో మునిగిపోయింది. ఆ ఫోన్‌ను దొరకపట్టడానికి అప్పుడే చాలా ప్రయత్నం చేసింది. కానీ, పెద్ద ఎత్తున వచ్చిన అలలు ఆమెను సఫలీకృతం కానివ్వలేదు. ఇక తన ఫోన్‌ను మళ్లీ చూడబోదనే నిరాశతో ఇంటికి వెళ్లిపోయింది.

Also Read: సెల్‌ఫోన్ల చోరీ ముఠాలో ఇద్దరు అరెస్ట్ ,మరో నలుగురి కోసం గాలింపు:కడప ఎస్పీ

కానీ, బీచ్‌లో ఓ డాగ్ వాకర్ ఈ ఫోన్‌ను తీరంలో చూశాడు. బహుశా ఆ ఫోన్ అలలతో దరికి చేరి ఉండొచ్చని భావిస్తున్నారు. నవంబర్ 7వ తేదీన ఫోన్ మళ్లీ ఆమె వద్దకు చేరుకుంది. ఆ ఫోన్‌కూ పెద్దగా స్కాచ్‌లు లేవు. అయితే, అది ఒక కేస్‌లో ఉన్నది. డాగ్ వాకర్ ఆ ఫోన్ కనిపించగానే.. కేస్‌లో ఉన్న క్లేర్ తల్లి మెడికల్ కార్డు వివరాల ఆధారంగా ఫోన్ సమాచారాన్ని అందజేశారు.

తన ఫోన్ ఇంకా మంచిగా పని చేస్తున్నదని క్లేర్ సంభ్రమాశ్చర్యాలతో తెలిపింది. ఇది పని చేస్తున్నదని ఇంకా నమ్మలేకపోతున్నానని వివరించింది. తన ఫోన్ వెనుకవైపు మొత్తంగా గీసుకుపోయిందని పేర్కొంది. అయితే, ఈ ఫోన్‌ను చూసిన వ్యక్తి, తాను షాక్ అయ్యామని, ఈ ఫోన్ ఇంకా పని చేస్తూనే ఉండటం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని వివరించారు.

click me!