వీడి పాపం పండింది.. చావుకు దగ్గరైన లష్కర్-ఎ-తోయిబా సహ వ్యవస్థాపకుడు

Published : May 21, 2025, 11:29 AM ISTUpdated : May 21, 2025, 12:07 PM IST
Amir Hamza

సారాంశం

లష్కర్-ఎ-తోయిబా (LeT) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా పాపం పండింది. అతడు ప్రస్తుతం చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ పాకిస్థాన్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంతకూ అతడికి ఏమయ్యిందో తెలుసా?  

పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా (LeT) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మంగళవారం పాకిస్తాన్‌ లాహోర్‌లోని ఒక మిలిటరీ ఆసుపత్రిలో అతడు చేరినట్లు సమాచారం. అతడికి ISI భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అమీర్ తన ఇంట్లోనే ప్రమాదానికి గురయి తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. అతడికి ఐసియూలో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. 

66 ఏళ్ల హంజా లష్కర్ ప్రచార విభాగానికి నాయకత్వం వహించిన వ్యక్తి  లష్కర్-ఎ-తోయిబా సీనియర్ రిక్రూటర్, ఆపరేషనల్ హ్యాండ్లర్ అబూ సైఫుల్లాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన మూడు రోజుల తర్వాత హంజా గాయపడ్డారు. ఇలా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక వ్యక్తులు వరుస ప్రమాదాలకు గురవుతున్నారు. 

హంజా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని లష్కర్ అనుకూల టెలిగ్రామ్ ఛానెల్ క్లారిటీ ఇచ్చింది. అతడు ప్రమాదంలో గాయపడినట్లు… లష్కరే తోయిబా మద్దతుదారులు ఆందోళనకు గురికావద్దని, ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు.

పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన హంజాను ఆగస్టు 2012లో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కర్ జిహాదీ వ్యవస్థలో కీలక వ్యక్తి అయిన ఆయన చాలా కాలంగా హఫీజ్ సయీద్, అబ్దుల్ రెహ్మాన్ మక్కీలతో సంబంధం కలిగి ఉన్నారు. వీరిద్దరూ యూఎన్ నిషేధించిన ఉగ్రవాదులు.

2000ల ప్రారంభంలో హంజా భారతదేశంలో చురుకుగా ఉండేవాడు. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని సైఫుల్లాతో కలిసి ప్లాన్ చేసినట్లు అనుమానిస్తారు. ఆ తర్వాత అతన్ని ఫీల్డ్ ఆపరేషన్స్ నుండి గ్రూప్ ప్రచార విభాగానికి బదిలీ చేశారు.

హంజా లష్కర్ ప్రచురణ విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. ఖఫిలా దావత్ ఔర్ షహాదత్ (కారవాన్ ఆఫ్ ప్రోసెలైటైజింగ్ అండ్ మార్టిర్‌డమ్), షహ్రా-ఎ-బహిష్త్ (రోడ్ టు ప్యారడైజ్) వంటి పుస్తకాలు రాశారు హంజా. 

2018లో లష్కర్, దాని అనుబంధ సంస్థ జమాత్-ఉద్-దావాను నిషేధించిన తర్వాత హంజాకు సయీద్ కొత్త సంస్థను జైష్-ఎ-మంకాఫా సృష్టించే బాధ్యతను అప్పగించారు. లష్కర్ అంతర్జాతీయ సంబంధాలను నిర్వహించడంలో హంజా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

హంజా LeT-అనుబంధ ఛారిటీకి నాయకత్వం వహించాడు. సయీద్ నేతృత్వంలోని లష్కర్ యూనివర్సిటీ ట్రస్ట్‌లో అధికారిగా, సభ్యుడిగా కూడా ఉన్నాడు. హంజా LeT వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. LeT ప్రచురణకు కూడా కథనాలు అందించాడు.

 నిర్బంధించబడిన లష్కర్ సభ్యుల విడుదల కోసం చర్చలు జరపడానికి నియమించబడిన ముగ్గురు LeT ఉగ్రవాదులలో హంజా ఒకడు. LeT 'స్పెషల్ క్యాంపెయిన్స్' విభాగానికి అధిపతిగా కూడా పనిచేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే