Russia Ukraine Crisis: 'ఎమర్జెన్సీ కిట్' ను ఎప్పుడూ వెంట ఉంచుకోండి.. భార‌తీయుల‌కు కేంద్రం స‌ల‌హాలు

Published : Mar 03, 2022, 11:25 PM IST
Russia Ukraine Crisis: 'ఎమర్జెన్సీ కిట్' ను ఎప్పుడూ వెంట ఉంచుకోండి.. భార‌తీయుల‌కు కేంద్రం స‌ల‌హాలు

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ లో ఇరుక్కపోయిన భార‌తీయుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని సూచ‌నలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఉన్న విప‌త్తుక‌ర ప‌రిసిత్థుల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని భార‌త‌ రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది. యుద్ధ ప్రాంతంలో ఉన్న భారతీయులు ఎల్లప్పుడూ త‌మ వెంట అవసరమైన వస్తువులతో కూడిన ఎమర్జెన్సీ కిట్‌ను  తీసుకెళ్లాలని సూచించింది.

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ లో ఇరుక్కపోయిన భార‌తీయుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని సూచ‌నలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఉన్న విప‌త్తుక‌ర ప‌రిసిత్థుల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని భార‌త‌ రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది. యుద్ధ ప్రాంతంలో ఉన్న భారతీయులు ఎల్లప్పుడూ త‌మ వెంట అవసరమైన వస్తువులతో కూడిన ఎమర్జెన్సీ కిట్‌ను  తీసుకెళ్లాలని సూచించింది. ఈ ఎమర్జెన్సీ కిట్‌లో పాస్‌పోర్ట్, ID కార్డ్, అవసరమైన మందులు, టార్చ్, అగ్గిపెట్టె, లైటర్, కొవ్వొత్తులు, నగదు, ఎనర్జీ బార్‌లు, పవర్ బ్యాంక్‌లు, నీరు, ప్రథమ చికిత్స కిట్, తలపాగా, మఫ్లర్, గ్లోవ్‌లు, జాకెట్, బూట్ల ను ఆ కిట్ లో ఉంచుకోవాల‌ని సూచించింది. ఈ కిట్‌ను ఎల్ల‌ప్పుడూ త‌మ వెంట ఉంచుకోవాల‌ని కోరింది.

అంతేకాకుండా ప‌లు సూచ‌న‌లు కూడా ఇచ్చింది. 'మేము విద్యార్థులం', 'మేము పోరాట యోధులం కాదు', 'దయచేసి మాకు హాని చేయవద్దు' 'మేము భారతదేశం నుండి వచ్చాము' వంటి ప్రాథమిక సంభాషణ కోసం రష్యన్ నేర్చుకోవాలని ఒక సలహా ఇచ్చింది. అలాగే.. ఫోన్ల‌ల్లో బ్యాటరీని ఆదా చేయడానికి అనవసరమైన యాప్‌లను తొలగించాలని తెలిపింది. అదేవిధంగా ఆరోగ్యంపై శ్ర‌ద్ద పెట్టాల‌ని ఆహార స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావొచ్చ‌ని, శ‌రీరం డీ హైడ్రేటెడ్‌గా చూసుకోవాల‌ని పేర్కొంది.   

వైమానిక దాడులు, ఎయిర్‌క్రాఫ్ట్/డ్రోన్‌ల దాడులు, క్షిపణి దాడులు, తుపాకీ కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లు, షెల్లింగ్ దాడులు జ‌రిగే ఛాన్స్ ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది.  ఈ త‌రుణంలో భవనాలు కూలిపోవడం, శిధిలాలు ఊడి ప‌డొచ్చ‌ని, ఇంటర్నెట్ జామింగ్, ఉష్ణోగ్ర‌త‌ల్లో మార్పులు రావొచ్చని.. వీట‌న్నింటి దృష్ట్యా ఈ జాగ్ర‌త్త‌లను ఖార్కీవ్‌లో ఉన్న భార‌తీయులు తీసుకోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం సూచించింది.

మిలిటరీ చెక్-పోస్ట్ ల్లో పోలీసు సిబ్బందికి సహకరించాలనీ, ఎప్ప‌టిక‌ప్పుడూ అవసరమైన సమాచారాన్నికంట్రోల్ రూమ్/హెల్ప్‌లైన్ కి తెలియ‌జేయాల‌ని పేర్కొంది.  విద్యుత్, ఆహారం, నీరు, గడ్డకట్టే ఉష్ణోగ్రతకు గురించి హెచ్చరించింది.  మానసిక మ‌నోధైర్యంతో ఉండాలని సూచించింది. 

సమాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడూ కంపైల్ చేయండి, మీ తోటి భారతీయులతో పంచుకోండని తెలిపింది. అలాగే.. మానసికంగా దృఢంగా ఉండండి. భయపడకండని తెలిపింది. మీ స‌మాచారాన్ని ఎల్లప్పుడూ మీ స్నేహితుల‌కు తెలియ‌జేయాలి. సామాజిక మాధ్యమాలWhatsApp ద్వారా ఎంబసీ లేదా న్యూఢిల్లీలోని కంట్రోల్ రూమ్‌ల‌కు లొకేషన్‌ను షేర్ చేయండి. ప్రతి ఎనిమిది గంటలకు ఒక్క‌సారి ఇలా లొకేష‌న్ షేర్ చేయాల‌ని తెలిపింది.
  
బంకర్‌లు/బేస్‌మెంట్లు/ఆశ్రయం పొందుతున్న వారు బయటికి రాకుండా ఉండండి. రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దు. సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం మానుకోండి. ఆయుధాలు లేదా పేలని మందుగుండు సామగ్రిని తీసుకోవద్దు. సైనిక వాహనాలు, దళాలు, సైనికులు, చెక్ పోస్ట్‌ల వ‌ద్ద సెల్ఫీలు తీసుకోవద్దు. ప్రత్యక్ష పోరాట పరిస్థితులను చిత్రీకరించడానికి ప్రయత్నించవద్దు. సైరన్‌ల సందర్భంలో, సాధ్యమైన చోట వెంటనే ఆశ్రయం పొందండి. బాంబు దాడుల జ‌రిగే స‌మయంలో బహిరంగ ప్రదేశంలో ఉంటే.. బోర్లా ప‌డుకుని, తలను చేతుల‌తో క‌వ‌ర్ చేసుకోండి. మద్యం సేవించవద్దు. అలాగే.. మాదకద్రవ్య దుర్వినియోగం చేయ‌వ‌ద్దు. పేలుళ్లు లేదా కాల్పుల సమయంలో గ్లాస్ వస్తువుల‌కు దూరంగా ఉండండ‌ని ప‌లు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చింది.
 
 ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురావాల‌న్న ఏకైక ల‌క్ష్యంతోనే ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని విదేశాంగ శాఖ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై తాము అన్ని దేశాల ప్ర‌తినిధుల‌తో ట‌చ్‌లోనే ఉన్నామ‌ని విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి అరిందం బాగ్చీ స్ప‌ష్టం చేశారు. ఉక్రెయిన్ నుంచి భార‌త్‌కు తిరిగి వ‌చ్చే విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ 20 వేల మంది భార‌తీయులు రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌ని, అయినా.. మ‌రి కొంద‌రు మిగిలే ఉండిపోయార‌ని ఆయ‌న తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే