నేడే కింగ్ చార్లెస్ పట్టాభిషేకం.. 100 మంది దేశాధినేతలు, 203 దేశాల ప్రతినిధులు హాజరు.. ఇంకా ఎన్ని ప్రత్యేకతలో ?

By Asianet NewsFirst Published May 6, 2023, 9:26 AM IST
Highlights

లండన్‌ నేడు కింగ్ చార్లెస్ -3 పట్టాభిషేక వేడుకకు జరగనుంది. ఈ కార్యక్రమానికి 100 మంది దేశాధినేతలు, 203 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ వేడుక నేడు బకింగ్ హామ్ ప్యాలెస్ లో చేపట్టనున్నారు. 

గత ఏడాది సెప్టెంబర్ లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో యునైటెడ్ కింగ్ డమ్ తో పాటు మరో 14 రాజ్యాలకు రాజుగా బాధ్యతలు స్వీకరించిన కింగ్ చార్లెస్- 3, క్వీన్ కన్సర్ట్ కెమిల్లాలకు వెస్ట్ మినిస్టర్ అబ్బేలో పట్టాభిషేకం చేయనున్నారు. ఈ వేడుక నేడు బకింగ్ హామ్ ప్యాలెస్ లో జరగనుంది. ఈ పట్టాభిషేక కార్యక్రమానికి  2,200 మందికి పైగా అతిథులు హాజరవనున్నారు.

బారాముల్లాలో ఎన్ కౌంటర్, లష్కరే ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్

ఈ కార్యక్రమానికి 100 మంది దేశాధినేతలు, రాజకుటుంబ సభ్యులు, 203 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు కమ్యూనిటీ, చారిటీ ఛాంపియన్లు హాజరుకానున్నారు. 70 ఏళ్ల క్రితం చార్లెస్ తల్లి 1953 జూన్ లో క్వీన్ ఎలిజబెత్-2గా పట్టాభిషేకం జరిగింది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. 

అయితే చార్లెస్ - 3 పట్టాభిషేకం 10.00 గంటలకు (జీఎంటీ) ప్రారంభం కానుంది. దానికి ముందు బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి ఊరేగింపు జరగనుంది. అయితే 70 ఏళ్ల క్రితం తన తల్లి కోసం జరిగిన ఊరేగింపు కంటే ఈ ఊరేగింపు చిన్నది. ఈ వేడుకను సజావుగా నిర్వహించేందుకు లండన్ లో 12 వేల మంది పోలీసులు, 10 వేల మంది సైనికులను మోహరించారు. పట్టాభిషేకం అనంతరం కింగ్ చార్లెస్, క్వీన్ కన్సర్ట్ కెమిల్లా వెస్ట్ మినిస్టర్ అబ్బే నుంచి బకింగ్ హామ్ ప్యాలెస్ వరకు ఊరేగింపుగా వెళ్లి రాజకుటుంబంతో కలిసి ప్రైవేట్ లంచ్ చేస్తారు.

చెదలను నివారిస్తామని చెప్పి.. బెడ్ రూమ్ లోకి వెళ్లిన దుండగుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

ఇదిలావుండగా.. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ శుక్రవారం లండన్ చేరుకున్నారు. వెంటనే కింగ్ చార్లెస్ 3తో రిసెప్షన్ లో మాట్లాడారు. ‘‘కింగ్ చార్లెస్-3 పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, డాక్టర్ సుదేశ్ ధన్కర్ కు ఘనస్వాగతం లభించింది.’’ అని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. లండన్ లోని మార్ల్ బరో హౌస్ లో కామన్ వెల్త్ నేతలకు ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో ఉపరాష్ట్రపతి చార్లెస్ - 3తో సంభాషించారని మరో ట్వీట్ లో పేర్కొంది.

మేఘాలయకు పాకిన కుకీ, మైతేయ్ వర్గాల మధ్య ఘర్షణలు.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో 16 మంది అరెస్టు..

లండన్ లోని మార్ల్ బరో హౌస్ లో కామన్ వెల్త్ జనరల్ సెక్రటరీ బారోనెస్ పాట్రిసియా స్కాట్లాండ్ నిర్వహించిన చర్చలకు ఇతర కామన్ వెల్త్ నాయకులతో కలిసి ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ‘‘లండన్ లోని మార్ల్ బరో హౌస్ లో హెచ్ ఎం కింగ్ చార్లెస్ 3 నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కామన్వెల్త్ దేశాల నాయకులతో కలిసి విపి జగ్ దీప్ ధన్ కర్ పాల్గొన్నారు. కామన్వెల్త్ సంస్థను మరింత బలోపేతం చేయడంపై కామన్వెల్త్ నేతలతో అభిప్రాయాలను పంచుకున్నారు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

click me!