kash patel: అమెరికా దర్యాపు సంస్థ డైరెక్టర్‌గా భారత సంతతి వ్యక్తి.. ఎవరీ కాశ్ పటేల్‌, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి.?

Narender Vaitla | Updated : Feb 21 2025, 10:39 AM IST

భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను సెనేట్ గురువారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా  పటేల్ కృతజ్ఞతలు తెలుపుతూ, ఏజెన్సీని "పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడి ఉండేలా" పునర్నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు.. ఇంతకీ ఎవరీ కాశ్ పటేల్.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి.? లాంటి వివరాలు తెలుసుకుందాం.. 

భారత సంతతికి చెందిన కాశ్ పటేల్‌ను సెనేట్ గురువారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీని పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడి ఉండేలా పునర్నిర్మించడానికి తనవంతు కృషి చేస్తానని మాటిచ్చారు. 

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీలకు పటేల్ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన..  FBIపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి నిబద్ధతో ఉంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఈ విషయమై పోస్ట్ చేసిన పటేల్.. "ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిదవ డైరెక్టర్‌గా ఎంపిక చేసినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచినందుకు అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ బోండీకి ధన్యవాదాలు." అంటూ రాసుకొచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "FBIకి గొప్ప చరిత్ర ఉంది - "G-మెన్" నుంచి  9/11 తర్వాత మన దేశాన్ని కాపాడటం వరకు. అమెరికన్ ప్రజలు పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడి ఉండే FBIని కోరుకుంటున్నారు. మన న్యాయ వ్యవస్థ రాజకీయం కారణంగా  ప్రజల నమ్మకాన్ని పోగొట్టింది. కానీ అది ఇవాళ్టితో ముగుస్తుంది." అని పునరుద్ఘాటించారు.  అమెరికన్ ప్రజలు గర్వపడేలా FBIని ఒక సంస్థగా పునర్నిర్మించడానికి తన శక్తిమేరకు కృష్టి చేస్తానని పటేల్ తెలిపారు. 

"బ్యూరోలోని అంకితభావంతో పనిచేసే పురుషులు, మహిళలు, మా భాగస్వాములతో కలిసి పనిచేస్తూ, అమెరికన్ ప్రజలు గర్వపడేలా FBIని పునర్నిర్మిస్తాం. అమెరికన్లకు హాని కలిగించాలని చూసేవారికి ఇది హెచ్చరిక. ఈ గ్రహం మీద ప్రతి మూలలో మిమ్మల్ని వేటాడతాం' అని పటేల్ హెచ్చరించారు. 

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారుడైన కాశ్ పటేల్‌ను సెనేట్ గురువారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా ధృవీకరించింది. అమెరికా పెద్దల సభ సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ సెనెటర్లు అందరూ ఆయనకు మద్దతుగా నిలిచినా సుసన్ కోలిన్స్, లిసా ముర్కోవ్క్కీ మాత్రం మాత్రం డెమోక్రాట్ల పక్షం వహిస్తూ కాశ్ పటేల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. 

ఇంతకి ఎవరీ కాశ్ పటేల్.? 

భారత సంతతికి చెందిన పటేల్  మూలాలు గుజరాత్ లో ఉన్నాయి. ఆయన పేరెంట్స్ తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. తండ్రి ఉగాండాలో నియంత. ఈదీ ఆమిన్‌ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్‌ సిటీలో పటేల్‌ జన్మించారు. పటేల్ విద్యాభ్యాసం విషయానికొస్తే ఆయన యూనిర్సిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్.. యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఒక లా సంస్థలో పని చేయాలనుకున్నా కొలువు లభించలేదు. దీంతో ఆయన మియామీ కోర్టుల్లో పబ్లిక్‌ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు. 

Read more Articles on
click me!