పెంపుడు జంతువులా పెంచుకుంటే... యజమానిని చంపేసిన కంగారు..!

Published : Sep 13, 2022, 11:12 AM IST
పెంపుడు జంతువులా పెంచుకుంటే... యజమానిని చంపేసిన కంగారు..!

సారాంశం

తీవ్రగాయాలపాలైన అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే.. అతను చనిపోయినట్లు గుర్తించారు. అతని వయసు 77ఏళ్లు కాగా... ఎప్పటి నుంచో దానిని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

చాలా మంది పెంపుడు జంతువులుగా కుక్కలు, పిల్లులను పెంచుకోవడం మనం చూసే ఉంటాం.  అయితే...  ఓ వ్యక్తి కంగారును పెంచుకున్నాడు. అయితే.. ఆ కంగారు నే అతనిని చంపేయడం గమనార్హం. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్ట్రేలియాలోని తక్కువ జనాభా కలిగిన దక్షిణ పట్టణం రెడ్ మండ్ లో ఓ వ్యక్తి ఇటీవల తీవ్రగాయాలపాలయ్యాడు. అతనిపై కంగారు దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. తీవ్రగాయాలపాలైన అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే.. అతను చనిపోయినట్లు గుర్తించారు. అతని వయసు 77ఏళ్లు కాగా... ఎప్పటి నుంచో దానిని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఆ కంగారు అడవి జంతువుగా గుర్తించారు. అది సాధారణ కంగారు కాదని.. ప్రాణాంతకమైనదని గుర్తించారు. దీంతో దానిని కాల్చి చంపేసినట్లు అధికారులు తెలిపారు. అయితే.. చనిపోయిన కంగారు ఏ జాతికి సంబంధించినది అనే విషయం మాత్రం తెలియలేదన్నారు. అయితే... ఈ కంగారు ఏడు అడుగులకు పైగా ఎత్తు ఉందని.. దాదాపు 70కేజీల బరువు ఉందని చెప్పారు.

కాగా.. కంగారు మనుషులను చంపడం ఇదేమి తొలిసారి కాదు అని వారు చెప్పారు. ఆస్ట్రేలియాలో 1936లో కూడా ఓ కంగారు ఓ వ్యక్తిని చంపిందని అక్కడి మీడియా పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?