జైలులోనే వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే పెళ్లికి అనుమతి..

By AN TeluguFirst Published Nov 13, 2021, 2:39 PM IST
Highlights

గతేడాది ఏప్రిల్ లో అసాంజే-మోరిస్ జంట తమ బంధాన్ని బయటపెట్టింది. ఈ ఏడాది జనవరిలో jailలో వివాహం చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.

లండన్ : బెయిల్ నిబంధనల ఉల్లంఘన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు భాగస్వామి స్టెల్లా మోరిస్ ను కారాగారంలోనే వివాహం చేసుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించింది. వివాహ తేదీ మీద ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. 

లండన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో Julian Assange తన న్యాయవాదులలో ఒకరైన స్టెల్లా మోరిస్ తో ప్రేమలో పడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఏప్రిల్ లో అసాంజే-మోరిస్ జంట తమ బంధాన్ని బయటపెట్టింది. 

ఈ ఏడాది జనవరిలో jailలో వివాహం చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా కు చెందిన అసాంజే WikiLeaks లో అమెరికా రహస్య సమాచారాన్ని బయటపెట్టారు. ఆ దేశం నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్ లోని Embassy of Ecuadorలో కొంతకాలం ఆశ్రయం పొందారు. ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరిమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2019నుంచి లండన్ లోని జైలులో ఉన్నారు. 

కాగా, తన లీక్స్‌తో ప్రపంచంలోని ప్రముఖులను ముప్పుతిప్పలు పెట్టిన  వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను ఎట్టకేలకు బ్రిటీష్ పోలీసులు 
కాగా, 2019 ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్న అసాంజేను ఏడేళ్ల తర్వాత లండన్ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

వండర్ : 21వారాలకే పుట్టిన చిన్నారి.. ప్రీమెచ్యూర్ బేబీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్...

అసాంజేను త్వరలోనే వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపర్చారు. స్వీడన్‌లో నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో గత ఏడేళ్లుగా అసాంజే తలదాచున్నారు.

కాగా, అసాంజేను అరెస్ట్ చేసేందుకు లండన్‌తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ వికీలీక్స్ ఆ మధ్యకాలంలో ట్వీట్ చేసి సంచలనం రేపింది. ఈక్వేడార్ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల నుంచి తమకు ఈ సమాచారం అందినట్లు వికీలీక్స్ వెల్లడించింది.

బ్రిటీష్ పోలీసులను ఆహ్వానించి మరీ అసాంజేను అప్పగించిందని వికీలీక్స్ తాజాగా చేసిన మరో ట్వీట్‌లో పేర్కొంది. ఇది ఇలావుంటే, అసాంజేను తమ కస్టడీకి అప్పగించాలంటూ అమెరికా.. బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది.
 

click me!