వండర్ : 21వారాలకే పుట్టిన చిన్నారి.. ప్రీమెచ్యూర్ బేబీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్...

Published : Nov 12, 2021, 11:28 AM IST
వండర్ : 21వారాలకే పుట్టిన చిన్నారి.. ప్రీమెచ్యూర్ బేబీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్...

సారాంశం

కేవలం 21 వారాలు ఒక్క రోజుతో జన్మించి ఆరోగ్యంగా బ్రతికి బట్టగలిగాడు యూఎస్ కి చెందిన కర్టిస్ అనే చిన్నారి. అసలు విషయంలోకి వెళితే.. యూఎస్ లోని అలబామాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్ అనే చిన్నారి జూలై 2020లో 21వారాలు ఒక్క రోజుతో జన్మించి ప్రపంచంలోని అత్యంత నెలలు నిండని శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్నాడు. 

న్యూయార్క్ : నిజానికి నెలలు నిండకుండా పుట్టే పిల్లలు బతకడం అత్యంత అరుదు. ఒకవేళ బతికినా జీవితాంతం ఏవో అనారోగ్య సమస్యలతో సతమమవుతుంటారు. కానీ ఇప్పటివరకు నెలలు తక్కువగా పుట్టడం అంటే మహా అయితే డెలివరీ తేదీకి కాస్త ఒక నెల ముందుగా లేదా ఒక నెల రెండు వారాలు అంటు, ఇటుగా పట్టడం జరుగుతుంది. 

కానీ అలా ఇలా కాకుండా కేవలం 21 వారాలు ఒక్క రోజుతో జన్మించి ఆరోగ్యంగా బ్రతికి బట్టగలిగాడు యూఎస్ కి చెందిన కర్టిస్ అనే చిన్నారి. అసలు విషయంలోకి వెళితే.. యూఎస్ లోని అలబామాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్ అనే చిన్నారి జూలై 2020లో 21వారాలు ఒక్క రోజుతో జన్మించి ప్రపంచంలోని అత్యంత నెలలు నిండని శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్నాడు. 

ఆ చిన్నారి తల్లి మిచెల్ చెల్లీ బట్లర్ కి మొదట Pregnancy బాగానే ఉంది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆమె ఆరోగ్యంలో చిన్న సమస్య తలెత్తడంతో అత్యవసర శస్త్ర చికిత్స నిమిత్తం గతేడాది జూలై 4న ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆసుపత్రి నుంచి బర్మింగ్ హామ్ (యూఏబీ)లోని అలబామా విశ్వవిద్యాలయానికి మార్చారు. ఆ సమయంలో ఆమెకు Abortion చేయాలని నిర్ణయించారు. 

అయితే ఆమె పట్టబట్టడంతో Delivery dateకి 19 వారాలు ముందుగా అంటే 21 వారాల 1 రోజు (148 రోజులు) గర్భధారణతో జూలై 5న మధ్యాహ్నం 1గంటకు కర్టిస్ జన్మించాడు. అయితే వైద్య సిబ్బంది ఆ వయసు పిల్లలు బతకడం కష్టం అని తేల్చి చెప్పేశారు. కానీ ఆశ్చర్యంగా Curtis చికిత్సకు స్పందించడం మొదలుపెట్టాడు. 

అయినప్పటికీ వైద్యులు ఇలా బతకటం కష్టం ఈ విధంగా చికిత్స అందించటం చాలా ఒత్తిడితో కూడిన పని అని చెప్పారు. ఈ మేరకు యూఏబీ హాస్పిటల్ లోని పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రియాన్ సిమ్స్  మాట్లాడుతూ, ‘ఈ వయసులో ఉన్న పిల్లలు బతకలేరనే చాల కేసులు చెబుతున్నాయి. కానీ ఈ తల్లి ఆశ నెరవేరుతుందో లేదో అనుకున్నాను. 

తెలుగోడి అంతరిక్ష యాత్ర..!

పైగా  premature babyని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ కి తరలించడం కష్టమని గ్రహించాం. దీంతో ఆ బిడ్డ ఉన్న ప్రదేశం నుంచే చికిత్స అందించాం. అయితే ఆ చిన్నారి ఆక్సీజన్ కి స్పందించడం హృదయస్పందన రేటు పెరగడం జరిగింది. అంతే కాదు ఆ చిన్నారికి మూడు నెలల వయసు వచ్చే వరకు వెంటిలేటర్ మీద చికిత్స అందించాం..’ అని అన్నారు. 

ఆ తర్వాత ప్రాంతీయ Neonatal Intensive Care Unit (ఆర్ఎన్ఐసీయూ)లో 275 రోజులు గడిపిన తదనంతర చిన్నారి కర్టిస్ ఈ యేడాది ఏప్రిల్ 6న ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. ఈ మేరకు నియోనాటాలజీ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ కోల్మ్ ట్రావర్స్ చిన్నారి కర్టిస్ 21 వారాల 1 రోజు గర్బధారణ వయస్సులో జన్మించినవాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పి ఉండవచ్చన్న అనుమానంతో చిన్నారి తల్లి మిచెల్ తో Guinness World Recordకి దరఖాస్తు చేయించారు. 

అంతేకాదు గిన్నిస్ రికార్డు కూడా ప్రపంచంలోనే అత్యంత నెలలు నిండకుండా జన్మించిన అరుదైన చిన్నారిగా ప్రకటించడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?