కాళ్లు ముడుచుకోలేదా: రేప్‌కు గురైన మహిళతో జడ్జి

Published : Apr 07, 2019, 12:26 PM IST
కాళ్లు ముడుచుకోలేదా: రేప్‌కు గురైన మహిళతో జడ్జి

సారాంశం

అత్యాచారానికి గురైన మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఓ జడ్జిని మూడు మాసాల పాటు సస్పెండ్ చేయాలని  కోర్టు ప్యానెల్ సిఫారస్ చేసింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటు చేసుకొంది.

న్యూజెర్సీ:  అత్యాచారానికి గురైన మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఓ జడ్జిని మూడు మాసాల పాటు సస్పెండ్ చేయాలని  కోర్టు ప్యానెల్ సిఫారస్ చేసింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటు చేసుకొంది.

కోర్టుకు వచ్చిన నిందితులను న్యూజెర్సీలోని ఓషన్ కౌంటీ జడ్జి జాన్ రుస్సో‌ విచిత్రమైన ప్రశ్నలు వేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆయన ఇలానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవలనే అత్యాచారానికి గురైన బాధితురాలు కోర్టుకు హాజరైంది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో జడ్జి జాన్ రుస్సో వేసిన ప్రశ్నలు విని బాధితురాలు షాక్ ‌కు గురైంది. అత్యాచారం చేస్తున్న సమయంలో కాళ్లు ముడుచుకోలేదా... శరీర భాగాలను రక్షించుకోలేదా.. పోలీసులకు సమాచారం ఇవ్వలేదా... తప్పించుకోవడానికి ప్రయత్నించలేదా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు బాధితురాలు సమాధానం చెప్పింది.  అయితే ఈ తరహా ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదని జడ్జి  ప్యానెల్ అభిప్రాయపడింది. 9 మంది సభ్యుల జడ్జి ప్యానెల్ జాన్‌కు ఎలాంటి శిక్షను విధించాలనే దానిపై చర్చిస్తున్నారు. 

మూడు నెలల పాటు జీతం ఇవ్వకుండా సస్పెండ్ చేయాలని జడ్జి ప్యానెల్‌లో ఐదుగురు జడ్జిలు అభిప్రాయపడితే, అది సరిపోదని మిగిలిన వారు అభిప్రాయపడ్డారు.ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఈ ఏడాది జూలైలో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే