పాముని కాపాడిన మహిళ.. సోషల్ మీడియాలో వైరల్

Published : Apr 03, 2019, 12:19 PM IST
పాముని కాపాడిన మహిళ.. సోషల్ మీడియాలో వైరల్

సారాంశం

రోడ్డు మీద వెళ్తుంటే సడెన్ గా పాము కనపడిందనుకోండి. మీరైతే ఏం చేస్తారు.? దాదాపు  చాలా మంది బాబోయ్ అని అక్కడి నుంచి పారిపోతారు. ఇంకొందరైతే.. దానిని కొట్టి చంపేవరకు వదిలిపెట్టరు.

రోడ్డు మీద వెళ్తుంటే సడెన్ గా పాము కనపడిందనుకోండి. మీరైతే ఏం చేస్తారు.? దాదాపు  చాలా మంది బాబోయ్ అని అక్కడి నుంచి పారిపోతారు. ఇంకొందరైతే.. దానిని కొట్టి చంపేవరకు వదిలిపెట్టరు. కానీ ఓ మహిళ మాత్రం ప్రాణాలతో కొట్టి మిట్టాడుతున్న ఓ పామును తన చేతులతో స్వయంగా రక్షించింది. కాగా.. దీనికి సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు  చెందిన రోసా ఫాండ్ అనే మహిళ రోసా బ్రూక్స్‌విల్లే మార్గంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బీర్‌ కాన్‌లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పామును చూశారు. అంతే ఇక ఆలస్యం చేయకుండా టిన్‌ మూతను తీసి.. దానికి విముక్తి కలిగించారు.

కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన రోసా.. ‘నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. తన(పాము)ని రెండుసార్లు నా చేతులతో పట్టుకున్నాను’ అని క్యాప్షన్‌ జతచేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు స్పందించిన నెటిజన్లు.. ‘ అమ్మో.. మీకు చాలా ధైర్యం ఉందండీ. అది విషం లేని బ్లాక్‌ రేసరే అయినప్పటికీ మీ కేరింగ్‌ అమోఘం. ప్రపంచంలోని కేరింగ్‌ లేడీస్‌లో మీరూ ఒకరు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ