ప్రధాని హత్యకు కుట్ర.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష

By sivanagaprasad kodatiFirst Published Oct 10, 2018, 2:36 PM IST
Highlights

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హత్యకు కుట్ర పన్నిన కేసులో ఇద్దరు మాజీ మంత్రులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2004 ఆగస్టు 21న ప్రతిపక్షంలో ఉన్న హసీనా.. ఒక బహిరంగసభలో పాల్గొనేందుకు గాను ట్రక్కు నుంచి దిగుతున్న సమయంలో గ్రేనేడ్ దాడి జరిగింది. 

అయితే ఇది ఆమెకు దూరంగా పడటంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే పేలుడు కారణంగా హసీనా పాక్షికంగా వినికిడి శక్తిని కోల్పోయారు. కానీ 24 మంది అమాయాకులు ప్రాణాలు కోల్పోగా.. 500 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దీనిపై 14 సంవత్సరాల సుధీర్ఘ విచారణ అనంతరం మాజీ మంత్రులు అబ్దుల్ సలామ్ పింటూ, లుత్‌ఫోజ్మన్ బాబర్‌తో పాటు 18 మందికి మరణశిక్షను విధించింది. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్‌, బీఎస్‌పీ పార్టీ కార్యదర్శి హరిస్ చౌదరికి న్యాయస్ జీవితఖైదును విధించింది. 

click me!