నా ఒంటిపై దుస్తులు తీసేయమన్నాడు.. మోడల్ కామెంట్

By ramya neerukondaFirst Published Oct 11, 2018, 9:54 AM IST
Highlights

ఆ సమయంలో తాను కేవలం మిక్కీమౌస్ అండర్‌వేర్, స్పోర్టు బ్రా ధరించి ఉండగా, వాటిని కూడా తొలగించాలని ఫోటోగ్రాఫరు కోరాడని సారా తెలిపింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం నడుస్తోంది. తమపై జరిగిన లైంగిక దాడులను మీటూ ఉద్యమం ద్వారా మహిళలు ధైర్యంగా బయటకు చెప్పగలుగుతున్నారు. కాగా.. అమెరికా ప్రముఖ మోడల్ సారాజిఫ్ కూడా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించారు.

తాను 14ఏళ్ల వయసులో ఉండగా ఫోటో సెషన్ కోసం వెళితే తన ఒంటిపై ఉన్న బట్టలు తీయమని ఫోటోగ్రాఫర్లు అడిగారని 35 ఏళ్ల మోడల్ సారాజిఫ్ వెల్లడించారు. ప్రస్థుతం సారాజిఫ్ న్యూయార్క్ నగరంలో మోడల్ గా పలు షోలు నిర్వహిస్తూ వాణిజ్యప్రకటనల్లో నటిస్తోంది. తాను చిన్నతనంలో లైంగికవేధింపులు ఎదుర్కొన్నానని సారా వెల్లడించింది.

 14 ఏళ్ల వయసులో ఉండగా ఫోటో షూట్ కోసం తాను తల్లిదండ్రులేకుండా ఒంటరిగా ఫోటోగ్రాఫర్స్ అపార్టుమెంటుకు వెళ్లితే అక్కడ ఒక ఫోటోగ్రాఫరు తన ఒంటిపై దుస్తులన్నీ తొలగించాలని కోరినట్లు సారా వెల్లడించారు. ఆ సమయంలో తాను కేవలం మిక్కీమౌస్ అండర్‌వేర్, స్పోర్టు బ్రా ధరించి ఉండగా, వాటిని కూడా తొలగించాలని ఫోటోగ్రాఫరు కోరాడని సారా తెలిపింది. 

ఫోటోషూట్ సమయంలో డ్రగ్స్ ఉచితంగా ఇచ్చారని, వాటిని తీసుకొని మంచి ఫోజులు ఇవ్వాలని కోరారని సారా పేర్కొంది. మోడల్స్ భద్రత, రక్షణ కోసం తాను 2012లో ‘మోడల్ అలియన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని ఫ్యాషన్ పరిశ్రమలో లైంగికవేధింపుల నివారణకు ఈ సంస్థ పాటుపడుతుందని సారాజిఫ్ వివరించారు.

click me!