బతికే ఉన్నా..ఉగ్రవాదులపై చర్యలు ఆపండి: పాక్‌కు మసూద్ వార్నింగ్

By Siva KodatiFirst Published Mar 7, 2019, 4:29 PM IST
Highlights

జైషే మొహమ్మద్ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ మరణించాడంటూ భారత్, పాక్‌లతో పాటు అంతర్జాతీయంగా కథనాలు వస్తున్న తరుణంలో మసూద్ మరోసారి ప్రత్యక్షమయ్యాడు. 

జైషే మొహమ్మద్ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ మరణించాడంటూ భారత్, పాక్‌లతో పాటు అంతర్జాతీయంగా కథనాలు వస్తున్న తరుణంలో మసూద్ మరోసారి ప్రత్యక్షమయ్యాడు.

తాను బతికే ఉన్నానని, తాను చనిపోయినట్లుగా వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పాడు. ఎంతకాలం బతకాలి, ఎప్పుడు చనిపోవాలన్నది మన చేతిలో లేదని దానిని దేవుడు నిర్ణయిస్తాడని పేర్కొన్నాడు.

పాకిస్తాన్ ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయిందన్నాడు. జైషే ప్రతినిధులతో అధికారులు చర్చలు జరిపారంటూ పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఒత్తిడి వల్లే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పాడు...

ఇలాంటివి తన ముందు పని చేయదని, జైషేను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలని పాక్ ప్రభుత్వానికి తేల్చి చెప్పాడు. మసీదులు, మదర్సాలు, ముస్లింలపై ప్రభుత్వ విచారణను వెంటను నిలిపివేయాలని మసూద్ ప్రభుత్వానికి హెచ్చరించాడు.

పాకిస్తాన్ ఒక ముస్లిం దేశమని, మలాలా వంటి ఉదారవాదుల చేతుల్లోకి దేశం వెళ్లకూడదన్నాడు. భారత్‌లో తాను శిక్ష అనుభవించిన కాలంలో తనను చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డాడు. కశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా జీహాద్ మొదలుపెట్టాలని పిలుపునిచ్చాడు. 

click me!