రైతులకు మద్ధతు: రిహానాకు పలువురి ప్రశంసలు, లైక్ కొట్టిన ట్విట్టర్ సీఈవో

By Siva KodatiFirst Published Feb 5, 2021, 6:33 PM IST
Highlights

భారతదేశంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు అంతర్జాతీయ స్థాయిలో మద్ధతు లభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బెర్గ్, పాప్ సింగర్ రిహానా, అమెరికా ఉపాధ్యక్షురాలు మీనా హ్యారీస్‌లు అన్నదాతల తరపున ట్వీట్ చేశారు. 

ఈ క్రమంలో వీరిపై భారత ప్రభుత్వంలోని పెద్దలతో పాటు సెలబ్రెటీలు విరుచుకుపడుతున్నారు. భారతదేశం గురించి భారతీయులు నిర్ణయం తీసుకుంటారని.. దీనిపై బయటి శక్తుల జోక్యం అనవసరమంటూ చురకలంటిస్తున్నారు. అంతేకాకుండా గ్రేటా థన్‌బర్గ్, మీనా హ్యారీస్‌ల‌ దిష్టిబొమ్మలను పలు సంఘాలు దగ్థం చేసి తమ నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన పాప్‌ సింగర్ రిహానాకు వచ్చిన ప్రశంసాత్మక ట్వీట్లకు ట్విటర్ సీఈఓ జాక్‌ డోర్సే లైక్‌ కొట్టారు. ఇప్పటికే సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తోన్న అన్నదాతల అంశం అంతర్జాతీయంగా ట్రెండ్ అవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించిన  సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి పలు ట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్‌లను తొలగించాల్సిందిగా కేంద్రం ఇప్పటికే ట్విట్టర్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్ధితుల్లో రిహానాకు అనుకూలంగా ట్విట్టర్ సీఈవో స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, రిహానా సంఘీభావ ట్వీట్ అనంతరం..ఓ మీడియా సంస్థ పాత్రికేయురాలు రిహానాను ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘సుడాన్, నైజీరియా..ఇప్పుడు భారత్‌లో సామాజిక న్యాయం కోసం జరుగుతోన్న ఉద్యమాలకు రిహానా తన మద్దతును ప్రకటించారంటూ ఆ పాత్రికేయురాలు ప్రశంసించారు. 

click me!