కరోనాలో 4 వేల రకాలు.. షాకింగ్ విషయం చెప్పిన మంత్రి...

By AN TeluguFirst Published Feb 5, 2021, 12:41 PM IST
Highlights

కరోనాలో నాలుగు వేల రకాలున్నాయంటూ బ్రిటన్ మంత్రి ఒకరు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇన్ని రకాల వల్లే కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కునేలా ఫైజర్, ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 

బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమ పర్యవేక్షణ చేస్తున్న మంత్రి నదీమ్ జహానీ ఇలా అన్నారు. జన్యు క్రమం నమోదు పరిశ్రమల్లో 50 శాతానికి పైగా కంపెనీలు బ్రిటన్ లో ఉన్నాయని, కరోనా వైరస్ లలోని ఈ రకాలన్నింటినీ ఆయా పరిశ్రమల లైబ్రరీల్లో దాచి పెడితే.. అవసరాన్ని బట్టి వైరస్ లు విసిరే సవాళ్లను ఎదుర్కోవచ్చని, తదనుగుణంగా వ్యాక్సిన్ లను తయారు చేయచ్చని మంత్రి సూచించారు. 

వ్యాక్సిన్ విషయంలోనూ బ్రిటన్ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సిన్‌ అనే ప్రయోగానికి తెర తీసింది. ఒకే వ్యక్తికి కరోనా 2 డోసుల్ని, రెండు వేర్వేరు కంపెనీలవి ఇచ్చి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. 

ఈ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సిన్‌కి సంబంధించి మానవ ప్రయోగాలు కూడా ప్రారంభించినట్టుగా మంత్రి నదీమ్‌ చెప్పారు. ఇలా మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ తరహాలో వ్యాక్సిన్‌లు ఇవ్వడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఇలా రెండు వేర్వేరు రకాల కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ఒకే వ్యక్తికి ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించొచ్చని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. 
 
click me!