బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మంత్రివర్గంలో ఉన్న ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార్యలను ఎప్పుడూ కొద్దిగా మత్తులో ఉంచాలని సూచించారు. ఇలా చేయడం వల్ల సుధీర్ఘ కాలం పాటు వివాహ బంధం కొనసాగుతుందని తెలిపారు.
బ్రిటన్ అంతర్గత వ్యవహారాల మంత్రి జేమ్స్ క్లెవర్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 18వ తేదీని బ్రిటన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. అయితే దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తాను సరదాగా మాట్లాడానని, అది ఒక జోక్ అని అన్నారు.
ఇంతకీ జేమ్స్ క్లేవర్లీ ఏమన్నారంటే ?
ప్రధాని రిషి సునక్ ప్రభుత్వంలో అత్యంత సీనియర్ మంత్రుల్లో ఒకరైన క్లెవర్లీ ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఉన్న మహిళా అతిథులతో మాట్లాడుతూ.. ప్రతీ రాత్రి భార్యతో కొద్ది మోతాలు మత్తు మంు ఇచ్చే నిద్రపుచ్చాలి. కొద్ది మోతాదులో మత్తు మందు ఇవ్వడం చట్ట విరుద్ధమేమీ కాదు. భాగస్వామిని ఎప్పుడూ తేలికపాటి మత్తులో ఉచడం వల్ల సుదీర్ఘ కాలం పాటు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ఇలా చేయడం వల్ల ఆ మహిళకు తన భర్త కంటే బయట మంచి మనుషులు ఉన్నారని ఎప్పటికీ తెలియదు’’ అని అన్నారు.
undefined
కాగా.. బీబీసీలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి తెలియకుండా లేదా అనుమతి లేకుండా అతడి పానియం లేదా శరీరంలోకి మాదకద్రవ్యాలను పంపించే స్పైకింగ్ విధానంపై చర్యలు తీసుకునేందుకు ఆ దేశం హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలను ప్రకటించిన కొన్ని గంటల్లోనే క్లెవరీ ఈ వ్యాఖ్యలు చేయడం విచారకరం. ఇదిలా ఉండగా.. బ్రిటన్ అంతర్గత మంత్రి తన భార్యను యూనివర్సిటీలో చదువుకునే సమయంలో కలిశారు. అనంతరం వారు వివాహం చేసుకున్నారు. వారికిప్పుడు ఇద్దరు సంతానం ఉన్నారు.
అయితే జేమ్స్ క్లేవర్లీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. స్పైకింగ్ తీవ్రమైన, వినాశకరమైన నేరమని ప్రతిపక్ష లేబర్ పార్టీ హోం వ్యవహారాల విధాన ప్రతినిధి వైవెట్ కూపర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మహిళలు, బాలికలపై హింసను అరికట్టాల్సిన హోంశాఖ కార్యదర్శి ఇలాంటి జోకులు వేయడం సరికాదని, ఇది నమ్మశక్యంగా లేదని అన్నారు.
జేమ్స్ క్లెవర్లీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని పలు వర్గాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రతినిధి స్పందించారు. క్లేవర్లీ ఓ ప్రైవేట్ సంభాషణలో ఇలా మాట్లారని అన్నారు. అది ఒక జోక్ అని, దానిని ఎవరూ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అయినా ఈ విషయంలో జేమ్స్ క్షమాపణలు చెప్పారని తెలిపారు.