నమీబియాలో కరోనా వైరస్‌కు సంబంధించిన మొదటి కేసు మార్చి 13న నమోదయ్యింది. వెనువెంటనే దేశంలో కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకున్నారు. ఇవి కరోనా వ్యాప్తి నివారణకు ఎంతగానో దోహదపడ్డాయి.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యం దాని గుప్పెట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. లక్షల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లోనూ ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే... ఓ చిన్న దేశం మాత్రం ఈ వైరస్ ని తరిమికొట్టింది.
కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టిన రిపబ్లిక్ ఆఫ్ నమీబియా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. నమీబియాలో కరోనా వైరస్‌కు సంబంధించిన మొదటి కేసు మార్చి 13న నమోదయ్యింది. వెనువెంటనే దేశంలో కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకున్నారు. ఇవి కరోనా వ్యాప్తి నివారణకు ఎంతగానో దోహదపడ్డాయి.
undefined
ఏప్రిల్ 7 తరువాత ఈ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. ఇంతేకాదు ఇక్కడ కరోనా కారణంగా ఒక్కరు కూడా మృత్యువాత పడలేదు. నమీబియాలో మొత్తం 23 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 9 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా కేసు వెలుగు చూడగానే అక్కడి ప్రభుత్వం.... ప్రభుత్వేతర యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది.
ఇతర దేశాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని, సమర్థవంతమైన చర్యలు ప్రారంభించింది. నమీబియా అధ్యక్షుడు హేగ్ జి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. మార్చి 24 న దేశ సరిహద్దులను 30 రోజుల పాటు సీలు చేశారు. దేశం లోపల రవాణా వ్యవస్థను నిషేధించారు. కరోనా బారిన పడినవారికి వెంటనే చికిత్స అందించడం ప్రారంభించారు. లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారిని ప్రభుత్వం ఆదుకుంది. దేశంలో ఎక్కువ జనసాంద్రత లేకపోవడంతో నమీబియా కరోనాను త్వరగా కట్టడి చేయగలిగింది.