జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ మృతి?

By narsimha lodeFirst Published Mar 3, 2019, 6:04 PM IST
Highlights

 జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ మృతి చెందినట్టుగా ప్రచారం సాగుతోంది. 

ఇస్లామాబాద్: జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ మృతి చెందినట్టుగా ప్రచారం సాగుతోంది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మృతి చెందినట్టుగా ప్రచారంలో ఉంది. అయితే మసూద్ మృతి చెందారా లేదా అనే విషయమై పాకిస్తాన్ ఏ ప్రకటన చేయలేదు.

జైషే మహ్మద్ అధినేత మసూద్ తమ దేశంలోనే ఉన్నట్టుగా పాకిస్తాన్ ఇటీవలనే ప్రకటించింది. అయితే మసూద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టుగా ప్రకటించింది. 

పాక్‌లోని మిలటరీ ఆసుపత్రిలో  మసూద్  చికిత్స పొందుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మసూద్ అజార్ చనిపోయాడని ఆదివారం నాడు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, మసూద్ అజార్ మరణించినట్టుగా పాకిస్తాన్ ప్రకటించలేదు.

గత నెల 14వ తేదీన జైషే మహ్మద్ సంస్థ పూల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
 

click me!