భారతీయుడనుకుని...పాక్ పైలట్‌ను కొట్టి చంపిన పాకిస్తానీయులు

By Siva KodatiFirst Published Mar 3, 2019, 3:18 PM IST
Highlights

శత్రువుల చేతికి చిక్కినా అసాధారణ ధైర్య సాహసాలతో తిరిగి ప్రాణాలతో తిరిగొచ్చి దేశ ప్రజల జేజేలు అందుకున్నారు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. 

శత్రువుల చేతికి చిక్కినా అసాధారణ ధైర్య సాహసాలతో తిరిగి ప్రాణాలతో తిరిగొచ్చి దేశ ప్రజల జేజేలు అందుకున్నారు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. ఇదే సమయంలో అల్లరి మూకల చేతిలో ప్రాణాలు కోల్పోయారు పాక్ పైలట్ షాహాజుద్దీన్.

పాకిస్తాన్ వాయుసేన భారత సైనిక స్థావరాలపై దాడికి దిగేందుకు ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించింది. వాటిలో ఒకదానిని షాహాజుద్దీన్ అనే పైలట్ నడుపుతున్నారు. దీనిని పసిగట్టిన భారత వాయుసేన.. పాక్ విమానాలను వెంటాడింది.

ఇదే సమయంలో అభినందన్ వర్ధమాన్ తన మిగ్-21 విమానం ద్వారా షాహాజుద్దీన్ నడుపుతున్న విమానాన్ని వెంబడించారు. ఈ దిశలో అభినందన్ తన విమానం నుంచి ఆర్-73 అనే మిస్సైల్‌ను ప్రయోగించాడు.

దీంతో ఆఖరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవడానికి షాహజుద్దీన్ పారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో దిగారు. అయితే అప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ విషయంగా భారత్‌పై రగిలిపోతున్న స్థానిక అల్లరిమూకలు షాహాజుద్దీన్‌ను భారత పైలట్ అని పొరబడ్డారు.

అంతే అతనిని చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి..చికిత్స పొందుతూ మరణించారు. అభినందన్ వర్థమాన్ కూడా అల్లరిమూకలు చిక్కినప్పటికీ పాకిస్తాన్ సైన్యం ఆయనను క్షేమంగా కాపాడగలిగింది.

ఈ విషయం షాహజుద్దీన్‌కు బంధువైన లాయర్ ఖలిద్ ఉమర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. మరోవైపు అభినందన్, షాహాజుద్దీన్‌ది ఇద్దరిది ఒకే నేపథ్యం. ఇద్దరు ఒకే ర్యాంకు అధికారులు. ఇద్దరు తండ్రులు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయినవారే. 
 

click me!