Israel VS Iran-Pakistan: యుద్ధంలో ఇరాన్ ఓడితే..పాక్ పని ఇక అంతేనా!

Published : Jun 20, 2025, 06:19 PM IST
Iran Israel War

సారాంశం

ఇరాన్‌లోని రాజకీయ ఉద్రిక్తతలతో బలోచిస్థాన్‌, కుర్దిష్ వేర్పాటువాద ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయి. పాకిస్థాన్‌కూ ఈ పరిస్థితి సవాలుగా మారింది.

ఇరాన్‌ ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులతో గగుర్పాటు చోటు చేసుకుంటే, మరోవైపు అమెరికా ఎప్పుడు చర్య తీసుకుంటుందోననే భయంతో ఆ దేశం ఊపిరిపీల్చలేని పరిస్థితిలో ఉంది. ఈ తరుణంలో దేశం అంతర్గతంగా బలహీనమవుతోందని గమనించిన వేర్పాటువాద గుంపులు మళ్లీ ముంచుకొస్తున్నాయి.

బలోచిస్థాన్‌ ప్రాంతం ఇరాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉంది. ఇక్కడ నివసించే బలోచ్‌ ప్రజలు చరిత్రపరంగా దాడులు, అణచివేతలతో బాధపడుతున్నారు. ఇప్పుడు వీరందరూ తిరిగి ఐక్యంగా ఉద్యమాన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. పాకిస్థాన్‌ కూడా ఈ పరిణామాలతో భయపడుతోంది. ఎందుకంటే ఇరాన్‌లో శాసన వ్యవస్థ కూలిపోతే, అదే జ్వాల పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌కు కూడా వ్యాపించవచ్చని ఆ దేశ ఆర్మీ భావిస్తోంది.

ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. బలోచ్‌ జనాభా భారీగా ఇరాన్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు వీరంతా కొత్తగా ప్రత్యేక దేశం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజాగా బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాక్ మిలిటరీపై అనేక దాడులు జరిపింది. ఒకప్పుడు జఫార్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా ఈ గ్రూపే హైజాక్‌ చేసింది.

ఇరాన్‌, పాకిస్థాన్‌లకు మధ్య ఉన్న అసంతృప్తిని మరింతగా పెంచుతున్న మరో అంశం ‘జైష్ అల్ అదిల్’ అనే మిలిటెంట్ సంస్థ. ఇది ఇరాన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తూ వేర్పాటువాద భావజాలాన్ని వ్యాపింపజేస్తోంది. ప్రధానంగా బలోచ్‌ సమూహాలే దీనిలో ఉన్నాయి. ఈ సంస్థ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఖమేనీ ప్రభుత్వ పాలనలో బలూచిస్థాన్‌ ప్రజలు తీవ్రంగా అణచివేస్తున్నట్లు భావిస్తున్నారు. దాంతో  వారు తిరగబడాలని పిలుపునిచ్చింది. దీనివల్ల పాకిస్థాన్‌లోనూ అశాంతి చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇరాన్‌ సరిహద్దుల దగ్గరే కాదు, దేశంలోపలే ఉన్న మరో పెద్ద ప్రమాదం కుర్దుల రూపంలో ఎదుగుతోంది. కుర్దులు మెజారిటీ షియా ముస్లింల పాలనలో మైనారిటీగా మారి తీవ్రంగా హింసనకు గురవుతున్నారు. ఇప్పటికీ ఇరాన్‌లో 10 నుండి 12 మిలియన్ల కుర్దులు నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 15 శాతం వీరే. వీరు ఇప్పుడు ఖమేనీ పాలన కూలిపోవాల్సిందేననే నినాదంతో ఉద్యమిస్తున్నట్లు సమాచారం.

కేవలం ఇరాన్‌లోనే కాదు, ఇరాక్‌, సిరియా, తుర్కియే లాంటి దేశాల్లోనూ కుర్దులు మైనారిటీలుగా కొనసాగుతున్నారు. తుర్కియేలోని కుర్దిష్‌ మిలిటెంట్ గ్రూప్‌ను ప్రభుత్వం అణచివేయగా, సిరియాలో అహ్మద్‌ అల్ షారా పాలనలో కుర్దులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇరాన్‌లోనూ ఖమేనీ పాలన కింద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కుర్దిష్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్ ఇరాన్ (KDPI) ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.

ఇరాన్‌లో షియా ముస్లింలు అధిక శాతం కాగా, బలోచ్‌, కుర్దులాంటి సున్నీ మైనారిటీలు వేదన అనుభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న ఈ మైనారిటీ వర్గాలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి ఏర్పడుతోంది. అవే గుంపులు ఇప్పుడు ఖమేనీ పాలనకి సవాల్‌ విసరడానికి సిద్ధమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ అంతర్గత గందరగోళంలోకి ఇజ్రాయెల్‌ దాడులు, అమెరికా కదలికలు కూడా చేరుతున్నాయి. ఈ వాతావరణాన్ని ఉపయోగించుకొని బహుళ మిలిటెంట్‌ గ్రూపులు, వేర్పాటువాద పార్టీలు తమ ఆజెండాను ముందుకు నడిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక ఇరాన్‌ ప్రభుత్వం ఈ ఒత్తిడిని తట్టుకోగలదా? లేదంటే దేశంలో తిరుగుబాట్ల ఊపిరి మరింత బలపడుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సామాన్యంగా చూడతె, ఈ పరిణామాలు కేవలం ఇరాన్‌ సమస్యగా మిగలకపోవచ్చు. అదే సమయంలో పాకిస్థాన్‌లోని జాత్యాతీత సమతుల్యాన్ని కూడా కుదిపేస్తే ఆశ్చర్యం లేదు. రెండు దేశాల్లోనూ ఉన్న బలోచ్‌, కుర్దిష్ మిలిటెంట్లు తమ ప్రభుత్వాలపై సామరస్యంతో దాడులు చేస్తే.. అది ప్రాంతీయ స్థాయిలో పెద్ద సంక్షోభానికి దారితీయవచ్చు.

ఈ పరిస్థితుల్లో ఇరాన్‌ ప్రభుత్వానికి శాంతి స్థాపనతో పాటు మైనారిటీ గుంపులకు న్యాయం చేయడం అత్యవసరం అయింది. లేకపోతే దేశం మొత్తం ఉగ్రవాద ఉద్యమాల భయంతో వణికే ప్రమాదం ముప్పుతెచ్చుకుంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే