పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడికి దిగడంతో టెన్షన్ నెలకొంది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. మంగళవారంనాడు ఈ దాడులు చేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. హమాస్ పై ఇజ్రాయిల్ దాడులు నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ దాడితో రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడినట్టుగా ఇరాన్ ప్రకటించింది. జైష్ ఆల్ ఆదిల్ అనే సంస్థను 2012లో స్థాపించారు. ఇది సున్నీ మిలిటెంట్ గ్రూప్. ఈ గ్రూప్ పాకిస్తాన్ సరిహద్దులో పనిచేస్తుంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇరాన్ పోరాటం చేసింది.
undefined
ఇరాన్ సరిహద్దుల్లో పనిచేసే పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్ లకు పాల్పడ్డారు.పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతాల్లో బలూచ్ జాతీయవాదులు మొదట్లో ప్రాంతీయ వనరుల వాటాను కోరుకున్నారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం కోసం తిరుగుబాటును ప్రారంభించారు.
సున్నీ మెజారిటీ పాకిస్తాన్ తిరుగుబాటు దారులకు ఆతిథ్యమిస్తుందని ఇరాన్ చాలా కాలంగా అనుమానిస్తుంది.ఇరాన్, సౌదీ అరేబియా గత మార్చిలో చైనా మధ్యవర్తిత్వానికి చేరుకున్నాయి.దీంతో ఉద్రిక్తతలను తగ్గించాయి.
ఇరాన్ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారని పాకిస్తాన్ ప్రకటించింది.ఈ విషయమై పాకిస్తాన్ కూడ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందన్నారు. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఇరాన్ సవాల్ చేసిందని పాకిస్తాన్ ఆక్షేపించింది.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని భారత్ కూడ గతంలో ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత దేశం సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయం తెలిసిందే . తాజాగా ఇరాన్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసినట్టుగా ప్రకటించడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.ఈ పరిణామం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటన ఏ పరిణామాలకు దారి తీస్తుందోననే చర్చ నెలకొంది.