ఇరాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ నటీ అరెస్టు.. ఆమె చేసిన నేరమేంటీ?

By Rajesh KarampooriFirst Published Dec 18, 2022, 1:47 PM IST
Highlights

ఇరాన్ లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసినందుకు ఆస్కార్-విజేత చిత్రం నటి తారనేహ్ అలిదూస్తీని ఇరాన్ అధికారులు అరెస్టు చేశారు.  ఈ విషయాన్ని మీడియా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

ఇరాన్ లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడిన వ్యక్తిని ఇటీవలే ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. అయితే ఆ  ఘటనకు సంఘీభావం తెలియజేసిందుకు ఓ ప్రముఖ నటిని ఇరాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ నటి ఎవరో కాదు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'ది సేల్స్‌మెన్' స్టార్ తారనేహ్ అలిదోస్తీ. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉరి ఘటనకు సంఘీభావం తెలుపుతూ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది. 

మీడియా కథనం ప్రకారం.. తారనేహ్ అలిదోస్తీ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు మద్దుతు తెలిపింది. నిరసన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు ఓ వ్యక్తికి మరణశిక్ష విధించబడింది అక్కడి ప్రభుత్వం. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఆ నటి సంఘీభావం తెలిపింది. నటి తన వాదనల ప్రకారం ఎటువంటి పత్రాలను అందించలేకపోయినందున ఆమెను అరెస్టు చేశారు. సెప్టెంబరులో ప్రదర్శనలు చెలరేగినప్పటి నుండి అలిదూస్తీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిరసనకారులకు సంఘీభావం తెలుపుతూ కనీసం మూడు పోస్ట్‌లు చేసింది. దాదాపు 8 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న ఆమె ఖాతా ఆదివారం నిలిపివేయబడింది.

ఇంతకీ తన పోస్టులో ఏం రాసింది? 

నటి అతిదూస్తీ తన పోస్ట్‌లో ‘‘అతని పేరు మొహసేన్ షెకారి. ఈ రక్తపాతాన్ని చూసి కూడా దీనిపై చర్యలు తీసుకోని ప్రతి అంతర్జాతీయ సంస్థలు మానవాళికి అవమానకరం’’ అని రాసుకొచ్చింది. టెహ్రాన్‌లోని ఒక వీధిని అడ్డుకున్నందుకు, దేశ భద్రతా దళాల సిబ్బందిపై షెకారీ కొడవలితో దాడి చేసినందుకు ఇరాన్ కోర్టు తీర్పు ప్రకారం..షెకారీని డిసెంబర్ 9న ఉరితీశారు. గత వారం.. నిరసనలకు సంబంధించి ఇరాన్ రెండవ ఖైదీ మజిద్రెజా రహ్నావార్డ్‌ను ఉరితీసింది. ఇతరులకు భయంకరమైన హెచ్చరికగా రహ్నవార్డ్ మృతదేహం నిర్మాణ క్రేన్‌కు వేలాడదీయబడింది. తన పారామిలిటరీ దళానికి చెందిన ఇద్దరు సభ్యులను రహ్నవార్డ్ కత్తితో పొడిచినట్లు ఇరాన్ అధికారులు ఆరోపించారు.

గతంలోనూ నటీ అలిదూస్తీ ఇరాన్ ప్రభుత్వాన్ని, పోలీసు బలగాలను విమర్శించారు. జూన్ 2020లో, 2018లో తన హిజాబ్‌ తొలగించిన మహిళపై దాడి చేసినందుకు ట్విట్టర్‌లో పోలీసులను విమర్శించిన తర్వాత ఆమె ఖాతాను సస్పెండ్ చేసి.. ఐదు నెలల పాటు జైలు శిక్ష విధించారు. సోషల్ మీడియాలో నిరసనకారులకు సంఘీభావం తెలిపినందుకు ఇరాన్‌లోని మరో ఇద్దరు ప్రముఖ నటీమణులు హెంగామెహ్ ఘజియానీ, కటయోన్ రియాహిలను అధికారులు అరెస్టు చేశారు. అంతరం విడుదల చేశారు.  

హిజాబ్ వ్యతిరేక నిరసనలు 
 
సెప్టెంబర్‌ నుంచి ఇరాన్‌ సెప్టెంబర్‌ నుంచి హిజాబ్ వ్యతిరేక నిరసనలతో అట్టుడికింది. హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదనే కారణంతో ఇరాన్ మోరలింగ్ పోలీసుల నిర్బంధంలో ఉన్న 22 ఏళ్ల మహసా అమిని సెప్టెంబర్ 16న మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసలు తీవ్రమయ్యాయి. ఈ నిరసనలు 1979 ఇస్లామిక్ విప్లవం ద్వారా స్థాపించబడిన ఇరాన్  దైవపరిపాలనకు అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా మారాయి. ఇరాన్‌లోని మానవ హక్కుల కార్యకర్తల ప్రకారం.. నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 495 మంది మరణించారు. 18,200 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

click me!