
Instagram influencers caught with Cocaine: అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ భారత కరెన్సీలో 30 లక్షల రూపాలయలుగా ఉంటుందని సమాచారం. అమెరికాలో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు SUVలో దాచిన $3 మిలియన్ల విలువైన కొకైన్‌తో పట్టుబడ్డారనీ, అలబామా ప్రాంతంలో కొకైన్ తీసుకెళ్తున్న సమయంలో రాక్వెల్ డోలోరెస్ ఆంటియోలా (34), మెలిస్సా డుఫోర్ (36)లను అరెస్టు చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపినట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
సంబంధిత కథనం ప్రకారం.. యూఎస్ లో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న ఇద్దరు మహిళలు వారి SUVలోని రహస్య కంపార్ట్‌మెంట్‌లలో $3 మిలియన్ల కొకైన్ ప్యాక్ చేసి తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అలబామాలోని మొబైల్ కౌంటీలో ఇంటర్‌స్టేట్ 10లో వారు తమ కారులో డ్రగ్స్ ను తరలిస్తుండగా రాక్వెల్లే డోలోరెస్ ఆంటియోలా, మెలిస్సా డుఫోర్ లను గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. కాగా, ఈ ఇద్దరికీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో మంచి గుర్తింపు ఉంది. ఆంటియోలా, రహ్కీ అని కూడా పిలుస్తారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లో నివాసముంటున్నారు. ఆమె ఒక గాయని, రాపర్ కూడా, 119కే ఫాలోవర్లు ఉన్నారు. డుఫోర్ ఒక ఫిట్‌నెస్ మోడల్, సెక్సీ స్వెట్స్ అనే దుస్తుల బ్రాండ్ యజమాని. డిజైనర్ కూడాను. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకు 11.1కే ఫాలోవర్లు ఉన్నారు.
ఈ గింజలతో గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీ వంటి రోగాలన్నీ మాయం..!
హౌస్ పార్టీ కోసం హ్యూస్టన్‌కు కలిసి రోడ్ ట్రిప్‌ను ప్రారంభించారనీ, ఈ క్రమంలోనే వారు అధిక మొత్తంలో మద్యం సేవించారని అధికారులు తెలిపారు. జూన్ 1న మొబైల్, అలబామా సమీపంలో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినందుకు మొబైల్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ వారిని ఆపి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వారి వాహనంలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులను కే-9 యూనిట్ అప్రమత్తం చేసింది. అధికారులు వారి బ్లాక్ ఫోర్డ్ ఎక్స్‌పెడిషన్‌ను పరిశీలించినప్పుడు, వారు కారు ఫ్లోర్‌బోర్డ్‌ల క్రింద 84 బండిల్స్‌లో ప్యాక్ చేసిన 216 పౌండ్ల కొకైన్‌ను గుర్తించారు. ఈ మాదకద్రవ్యాల విలువ $3 మిలియన్లు ఉంటుందని తెలిపారు.
లవ్ జిహాద్: ముస్లిం దుకాణంపై మూక దాడి.. ఉత్తరాఖండ్ లో ఉద్రిక్త పరిస్థితులు