యూఏఈలో డ్రోన్లపై నిషేధం.. అబుదాదిలో వరుస దాడులతో అప్రమత్తం..

By SumaBala BukkaFirst Published Jan 24, 2022, 7:05 AM IST
Highlights

ఇటీవల జరిగిన దాడుల గురించి నేరుగా ప్రస్తావించకుండా నిషేధిత ప్రాంతాల్లోనూ డ్రోన్ లను ఎగురవేస్తూ, వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించామని.. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశామని శాఖ తెలిపింది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.అత్యవసర పనుల కోసం డ్రోన్ లను ఉపయోగించాల్సి వస్తే... తప్పనిసరిగా అధికారులు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. 

అబుదాబి :  ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని Abu Dhabiలో తిరుగుబాటుదారులు జరిపిన Missile attackలో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన యూఏఈ ప్రభుత్వ స్థానికంగా నెలరోజులపాటు drones, Light sports aircraft కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఇటీవల జరిగిన దాడుల గురించి నేరుగా ప్రస్తావించకుండా నిషేధిత ప్రాంతాల్లోనూ డ్రోన్ లను ఎగురవేస్తూ, వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించామని.. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశామని శాఖ తెలిపింది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అత్యవసర పనుల కోసం డ్రోన్ లను ఉపయోగించాల్సి వస్తే... తప్పనిసరిగా అధికారులు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు అబుదాబి దాడుల తర్వాత యెమన్, సౌదీ అరేబియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు.. హుతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని రాజధాని సనాపై జరిపిన వైమానిక దాడుల్లో పదకొండు మంది మృతి చెందారు. దీంతోపాటు  సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన  ఎనిమిది డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి. ఆతర్వాత యెమన్ లో సాదా జైలుపై జరిపిన వైమానిక దాడుల్లో  70 మందికి పైగా మరణించారు. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధానిపై తిరుగుబాటుదారులు జనవరి 17న జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా కొద్ది గంటల్లోనే Saudi Arabia సంకీర్ణ దళాలు.. Houthi తిరుగుబాటుదారుల ఆధీనంలోని Yemen రాజధాని సనాపై జనవరి 18న వైమానిక దాడులు జరిపాయి. 

ఈ దాడుల్లో దాదాపు పదకొండు మంది మృతి చెందినట్లు సమాచారం.  దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 8 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి.  సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి లో యూఏఈ కూడా భాగస్వామి. వైమానిక దాడుల కారణంగా రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పదకొండు మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది...  అని స్థానికులు  తెలిపినట్లు ఓ వార్త సంస్థ పేర్కొంది. మృతుల సంఖ్యను వైద్య వర్గాలు ధ్రువీకరించాయి.  అబుదాబిపై తామే డ్రోన్,  క్షిపణి దాడులకు పాల్పడినట్లు  హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు గతంలోనూ సౌదీ అరేబియా సరిహద్దుల్లో పదే పదే దాడులకు పాల్పడ్డారు. అయితే సరిహద్దులు దాటి దాడి చేయడం ఇదే మొదటిసారి.  అమెరికా, ఇజ్రాయిల్ తదితర దేశాలు ఈ దాడులను ఖండించాయి. 

ఇదిలా ఉండగా, యెమెన్ లో దీర్ఘకాలికంగా కొన‌సాగుతున్న ఘర్షణ..  జనవరి 21 నాడు తీవ్ర హింస‌కు దారి తీసింది. అక్క‌డి (Yemen) జైలుపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 100 మంది మరణించారు. వేరు వేరు చోట్ల జ‌రిగిన మ‌రో వైమానిక దాడిలో ముగ్గురు పిల్ల‌లు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి హౌతీ తిరుగుబాటుదారులు వీడియో దృశ్యాల‌ను విడుదల చేశారు. జైలు పై జ‌రిగిన వైమానిక దాడిలో శిథిలాల కింద‌, అలాగే, చెల్లాచెదురుగా ప‌డివున్న శ‌వాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్న భ‌యాన‌క దృశ్యాలు ఆ వీడియోలో క‌నిపించాయి. చాలా కాలం నుంచి Yemen, Saudi Aarabia నేతృత్వంలోని సంకీర్ణ దేశాల మధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. 

click me!