
అమెరికాలోని నార్త్‌వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్శిటీకి చెందిన సాహితీ అనే భారతీయ విద్యార్థిని కారు ప్రమాదానికి గురైంది. నెల ప్రారంభంలో యుఎస్ హైవే 71లో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. ఆమె సహ ప్రయాణీకురాలిగా కారులో ప్రయాణిస్తుండగా.. ఆమె స్నేహితుడు వాహనాన్ని నడుపుతున్నట్లు వార్తా సంస్థ IANS నివేదించింది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో సాహితీ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను మిస్సోరిలోని సెయింట్ జోసెఫ్‌లోని మొజాయిక్ లైఫ్ కేర్‌లో అత్యవసర రక్షణకు తరలించారు. డాక్టర్ల ప్రకారం.. సాహితీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆమె అంతర్గత అవయాలకు గాయాలు, వెన్నెముక పగులు, చిన్న ప్రేగు గాయాలు వంటి పలు సమస్యలతో ఆమె బాధపడుతున్నారని తెలిపారు.
సాహితి ఆరోగ్య పరిస్థితిపై ఆమె బంధువు జాహ్నవి భేరి మాట్లాడుతూ.. సాహితికి మొజాయిక్ లైఫ్ కేర్‌లో అనేక శస్త్రచికిత్సలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం సాహితి ICUలో చికిత్స పొందుతుండని భేరి తెలిపారు. అలాగే.. సాహితీ ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో వైద్యులు తెలియడం లేదని భేరి వెల్లడించారు. ఆమె గాయాల తీవ్రత, రోగికి చేసిన సంక్లిష్ట శస్త్రచికిత్సల గురించి వైద్యులు ఆందోళన చెందుతున్నారని ఆమె తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆమె తెలిపారు. ఆమె తల్లిదండ్రులు భారతదేశంలో నివసిస్తున్నారు. అయితే.. సాహితి వైద్య ఖర్చులను తీర్చడంలో సహాయం చేయడానికి సోషల్ మీడియాలో ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు.
మరో సంఘటనలో, న్యూయార్క్‌లోని నార్త్ లిండెన్‌హర్స్ట్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ ఆదివారం (మార్చి 5) మరణించగా, ఆమె కుమార్తె , పైలట్ గాయపడ్డారని సఫోల్క్ కౌంటీ పోలీసులు తెలిపారు. మృతులను రోమా గుప్తా (63), ఆమె కుమార్తె 33 ఏళ్ల రీవా గుప్తాగా గుర్తించారు. ప్రస్తుతం పైలట్ ఫైజుల్ చౌదరి (23) స్టోనీ బ్రూక్ యూనివర్శిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు వ్యక్తులతో కూడిన చిన్న విమానం తూర్పు ఫార్మింగ్‌డేల్‌లోని రిపబ్లిక్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 2:18 గంటలకు బయలుదేరింది. ఇది టూరిస్ట్ ఫ్లైట్ అని సఫోల్క్ పోలీసులు తెలిపారు .