అస్ట్రేలియాతో ఇండియా సంబంధాలు నెక్స్ట్ లెవల్‌కి : నరేంద్ర మోడీ

Published : May 22, 2023, 08:48 PM IST
 అస్ట్రేలియాతో  ఇండియా సంబంధాలు  నెక్స్ట్ లెవల్‌కి : నరేంద్ర మోడీ

సారాంశం

అస్ట్రేలియాతో  తమ  దేశం సంబంధాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లనున్నట్టుగా  ప్రధాని మోడీ  పేర్కొన్నరు.   

సిడ్నీ:అస్ట్రేలియాతో    తమ  సంబంధాలను  నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాలని      కోరుకుంటున్నట్టుగా  ప్రధాని మోడీ  చెప్పారు. అస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు  ప్రధాని నరేంద్ర మోడీ  ఇంటర్వ్యూ ఇచ్చారు.  రక్షణ, భద్రతా  విషయంలో రెండు దేశాల  మధ్య  సంబంధాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లనున్నట్టుగా  మోడీ  వివరించారు.  అస్ట్రేలియాతో  ఇండియా  సంబంధాలు  గతంలో  కంటే   బలంగా  ఉన్నాయని  మోడీ అభిప్రాయపడ్డారరు.అస్ట్రేలియన్  పత్రికకు  మోడీ  ఇంటర్వ్యూ ఇచ్చారు. జపాన్, పీఎన్‌జీ పర్యటనను ముగించుకొని  అస్ట్రేలియాలో  ప్రధాని నరేంద్ర మోడీ  పర్యటిస్తున్నారు.  
క ఇంటర్వ్యూ ఇచ్చారు. 

తాను అంత సులభంగా సంతృప్తి చెందే వ్యక్తిని కానని  మోడీ  చెప్పారు. తన మాదిరిగానే  అస్ట్రేలియా  ప్రధాని ఉంటారన్నారు. తమ  రెండు దేశాల మధ్య సంబంధాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేందుకు  అస్ట్రేలియా ప్రధానితో  నిర్వహించే  సమావేశం దోహదపడుతుందని  ఆయన అభిప్రాయపడ్డారు.2014లో   అస్ట్రేలియాలో   ప్రధాని మోడీ  పర్యటించారు.  అస్ట్రేలియా  ప్రధాని ఈ ఏడాది మార్చి  మాసంలో పర్యటించారు. 

 ట్రేడ్ అగ్రిమెంట్స్,  వార్షిక  సమావేశాలు,   ఆర్ధిక సహకారంతో   రెండు దేశాల  మధ్య  సంబంధాలు  మరింత బలపడ్డాయని మోడీ అభిప్రాయడ్డారు.వేగంగా  అభివృద్ది  చెందుతున్న  ప్రవాస భారతీయులతో  రెండు దేశాల మధ్య  ధ్వైపాక్షిక  సంబంధాలు  మరింత మెరుగగుపడుతున్నాయని మోడీ చెప్పారు.ఆర్ధిక సహకారం,  వాణిజ్య ఒప్పందాలు ,  సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల మధ్య  సంబంధాలు సమూలంగా మారాయని  ప్రధాని  చెప్పారు. 

డిఫెన్స్, భద్రత,  పెట్టుబడులు, విద్య,   వాతావరణ మార్పులు, , సైన్స్  , వైద్యం, సంస్కృతి , క్రీడల వంటి  విషయాల్లో  అద్భుతమైన ప్రగతిని  సాధించినట్టుగా  మోడీ  గుర్తు  చేసుకున్నారు.  గత కొన్నేళ్లుగా అస్ట్రేలియాలో  ప్రవాస భారతీయుల సంఖ్య పెరిగిన విషయాన్ని మోడీ  .ప్రస్తావించారు. ప్రధాని మోడీ,  అస్ట్రేలియా ప్రధాని  అల్బెన్స్  లు  సిడ్నీలో ని ఒలంపిక్  పార్క్ లో    20 వేల మంది  ఇండియన్   అస్ట్రేలియన్ల సమావేశంలో  పాల్గొంటారు. జీ 7 సమ్మిట్ లో  అస్ట్రేలియా ప్రధానితో  నరేంద్ర మోడీ   ఇటీవలే  భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల  మెరుగక విషయమై  చర్చించారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే