
ఎవరెస్టును అత్యంత ఎత్తుకు అధిరోహించిన ఓ వ్యక్తి తిరిగి కిందికి దిగూతూ మృతి చెందిన విషాదం ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల ఆస్ట్రేలియన్ వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని 8,849 మీటర్లు ఎక్కి.. తిరికి కిందికి దిగుతుండగా మరణించాడని గార్డియన్ పత్రిక నివేదించింది. పెర్త్‌కు చెందిన జాసన్ బెర్నార్డ్ కెన్నిసన్ శుక్రవారం మరణించాడు.
అతని కుటుంబం దీనిమీద మాట్లాడుతూ "ఎవరెస్ట్ అధిరోహించాలన్న అతని లక్ష్యాన్ని సాధించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు, కానీ ఇంటికి తిరిగి రాలేకపోయాడు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఫేస్ బుక్ లో తమ సంతాపాన్ని చెబుతూ "అతను అత్యంత ధైర్యవంతుడు, సాహసోపేతమైన వ్యక్తి. తనను మేము ఎప్పటికీ మిస్ అవుతాం" అంటూ రాసుకొచ్చారు.
ఒక గైడ్ హిమాలయన్ టైమ్స్‌తో మాట్లాడుతూ, ఎవరెస్ట్ నుంచి అతను దిగుతున్నప్పుడు అసాధారణంగా ప్రవర్తించడం ప్రారంభించినట్లు వారు గమనించారు. అతనితో ఉన్న ఇద్దరు షెర్పా గైడ్‌లు సముద్ర మట్టానికి 8,400 మీటర్ల ఎత్తులో ఉన్న బాల్కనీ ప్రాంతానికి వెళ్లేందుకు అతనికి సహాయం చేశారు.
అరుదైన ఘటన.. పదహారేళ్ల తరువాత సొంత గుండెను చూసుకున్న మహిళ.. ఆ ఫీలింగ్ గురించి ఏం చెబుతోందంటే...
"వారి వద్ద ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయాయి. అందుకే, అతన్ని రక్షించడానికి ఆక్సిజన్ సిలిండర్లతో మళ్లీ ఎక్కాలని.. క్యాంప్ 4కి దిగాలని నిర్ణయించుకున్నారు" అని ఆసియా ట్రెక్కింగ్ చీఫ్ దావా స్టీవెన్ షెర్పా చెప్పారు. అయితే, బలమైన గాలుల కారణంగా, వారు శిబిరానికి చేరుకోలేకపోయారు. కెన్నిసన్ కుప్పకూలి మరణించాడు. ఎవరెస్ట్ అధిరోహకులు సాధారణంగా ''డెత్ జోన్'' అని పిలిచే 8000 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతంలో అతను మరణించాడు. అతని అవశేషాలు ఇప్పటికీ పర్వతం మీదే ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సి మరో ముఖ్య విషయం ఏంటంటే.. 17యేళ్ల క్రితం ఓ కారు ప్రమాదంలో అతని వెన్నెముకకు ప్రమాదం జరిగింది. దీంతో అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఇక ఎప్పటికీ అతను నడవలేడని పోలీసులు తెలిపారు. ఇది 2006లో జరిగింది. ఆ సమయంలో అతను పనికి వెళుతున్నప్పుడు రోడ్డు రైలు అతను ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో.. కారు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. వెన్నెముక గాయాల కారణంగా నడవలేకపోవడంతో.. వాటి సర్జరీలకు డబ్బును సేకరించడానికి అతను ఫండ్ రైజింగ్ పేజ్ ను మొదలుపెట్టాడు.
తన ఫండ్ రైజింగ్ పేజీలో కెన్నిసన్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించడానికి తాను ప్రయత్నిస్తానని రాశాడు. "అక్కడ నుండి మరింత ఎత్తులకు ఎక్కడానికి ప్రయత్నిస్తానని’కూడా రాశారు. ఈ సీజన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మీద జరిగిన పదో మృతి ఇది. నేపాల్ పర్యాటక శాఖ ప్రకారం ఈ సీజన్‌లో దాదాపు 450 మంది అధిరోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.