
Singapore: సింగపూర్‌లోని 19 ఏళ్ల భారతీయ సంతతి చెందిన యువకుడికి అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ యువకుడికి దాదాపు 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించబడింది సింగపూర్ కోర్టు. అసలేం జరిగింది..? అంత మొత్తంలో ఎందుకు జరిమానా విధించారని ఆలోచిస్తున్నారా..? అయితే.. ఈ కథనం చదవాల్సిందే..
సింగపూర్ స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం.. గత ఏడాది భారత సంతతి చెందిన కోట్రా వెంకట సాయి రోహన్‌కృష్ణ, అతని ముగ్గురు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గోన్నారు. అయితే.. సింగపూర్ లో ఈ సమయంలో కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేస్తుంది. అయినా.. వెంకట సాయి కరోనా నిబంధనలను లెక్క చేయకుండా... అతిక్రమిస్తూ.. ఆ పార్టీకి స్పైడర్‌మ్యాన్ దుస్తులలో వెళ్లాడు. ఈ సమయంలో అనేకమార్లు COVID-19 నిబంధనలు ఉల్లంఘించారు
ఇదిలా ఉంటే.. అతను, అతని ముగ్గురు స్నేహితులు కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో నడుపుతున్నారు. ఈ వేడుకు సంబంధించిన వీడియోను కొన్ని రోజుల తర్వాత ఆ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. దీంతో ఈ విషయం బయటపడింది. ఆ వీడియో 4నిమిషాలు 22సెకన్ల నిడివి ఉంది.
ఆ వీడియోను పరిశీలిస్తే.. .కోట్రా వెంకట సాయి.. కావాలనే.. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. కనీసం అతను ఫేస్ మాస్క్ పెట్టుకోకుండానే.. పార్టీలో తిరగటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియాను తన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టడంపై కూడా.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వెంకట సాయి.. గుంపులో కలిసి ఉండగా.. ఆ దృశ్యాలను అతని స్నేహితులు చిత్రీకరించారు.
సింగపూర్ నిబంధనల ప్రకారం.. COVID-19 నిబంధనలను ఉల్లంఘించి.. ఎవరైనా దోషిగా తేలితే వారికి 10,000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా ఒక్కో సారి ఆ రెండు కూడా విధించబడతాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన కోర్టు.. వెంకట సాయిని దోషి తేల్చింది. 4వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.