బంగారం కోసం గనుల్లో కోట్లాట.. వందమందికి పైగా మృతి... 40మందికి తీవ్ర గాయాలు... ఆఫ్రికాలో దారుణం..

Published : May 31, 2022, 10:12 AM IST
బంగారం కోసం గనుల్లో కోట్లాట.. వందమందికి పైగా మృతి... 40మందికి తీవ్ర గాయాలు... ఆఫ్రికాలో దారుణం..

సారాంశం

ఆఫ్రికా దేశంలోని ఓ గనిలో చెలరేగిన ఘర్షణల్లో వందమందికి పైగా మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. 

ఆఫ్రికా : మధ్య ఆఫ్రికా దేశం chadలో  ఘోరం జరిగింది. Gold mineల్లో Illegal excavations జరిపే ముఠాల మధ్య ఘర్షణలో వంద మందికిపైగా మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. Libya సరిహద్దులోని  గౌరీ బౌగౌడీ జిల్లాలో మే 23, 24 తేదీల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలను కట్టడి చేయడానికి అక్కడి సైన్యం రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి అక్కడ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది.

ఈ సరిహద్దు ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. లిబియా నుంచి అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన అరబ్స్ కు, తూర్పు చాద్ కు చెందిన  టమా కమ్యూనిటీకి మధ్య ఈ ఘర్షణలు జరిగినట్లు సమాచారం. అయితే ఘర్షణ చెలరేగడానికి గల ప్రధాన కారణాలు తెలియరాలేదు. బంగారం కోసం ఎగబడి ఉంటారని భావిస్తున్నారు. చాద్.. టెర్రరిజం తోపాటు rebels గ్రూపు దాటికి విలవిలలాడుతోంది.  రెబల్స్ ఘర్షణల్లోనే అధ్యక్షుడు ఇడ్రిస్ డెబీ మరణించగా..  అక్కడ ప్రస్తుతం ఆయన కొడుకు మహమ్మద్ డెబీ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 29న ఆఫ్రికా దేశమైన Sudanలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని 38 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం Mining Company తెలిపింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్ కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూసివేసిన gold mineలో ఈ ఘటన జరిగినట్లు మైనింగ్ కంపెనీ తెలిపింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది.

గత కొంతకాలం క్రితం సూడాన్ ప్రభుత్వం ఈ గనిలో తవ్వకాలను మూసివేసింది. అయితే బంగారం కోసం స్థానిక ప్రజలు తరచుగా గనిలోకి వెళుతుంటారు. గనులు కూలకుండా ఉండేందుకు ప్రభుత్వం కనీస భద్రత సౌకర్యాలు సైతం కల్పించడం లేదు.  దీంతో సూడాన్ లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో  బంగారం వెలికితీతకు సూడాన్ దేశం ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. 2020లో ఈ దేశం 36.6 టన్నుల బంగారాన్ని వెలికి తీసింది. 

ఇదిలా ఉండగా, ఈ సంవత్సరం ఆరంభంలో చైనాలోని ఓ బంగారు గనిలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. జనవరి 10న చైనాలోని షాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని బంగారు గనిలో పేలుడు జరిగిన రెండు వారాలకు సహాయక బృందాలు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 

జనవరి 10న బంగారు గనిలో ప్రమాదం సంభవించగా.. ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది.దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే