అమెరికాలో కాల్పులు... భారత సంతతి వ్యక్తి మృతి

By telugu news teamFirst Published May 28, 2021, 12:22 PM IST
Highlights

తప్తేజ్‌దీప్ సింగ్ ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లగా.. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో అకస్మాత్తుగా అతని సహోద్యోగి కాల్పులకు తెగబడ్డాడు

అమెరికాలో తుపాకీ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలిఫోర్నియాలో ఓ దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ కాల్పుల్లో ఓ భారత సంతతి వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో భారత సంతతికి చెందిన 36ఏళ్ల తప్తేజ్‌దీప్ సింగ్ కూడా ఉన్నారని అక్కడి మీడియా పేర్కొంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. సాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే యార్డులో భారత సంతతికి చెందిన తప్తేజ్‌దీప్ సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తప్తేజ్‌దీప్ సింగ్ ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లగా.. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో అకస్మాత్తుగా అతని సహోద్యోగి కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో తప్తేజ్‌దీప్ సింగ్‌తోపాటు అతనితో పని చేసే మరికొంత మంది ఉద్యోగులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

 కాగా.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దాడికి పాల్పడ్డ దుండగుడిని హతమార్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తప్తేజ్‌దీప్ సింగ్ మృతి పట్ల అతని సహోద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. కాల్పుల సమయంలో తప్తేజ్‌దీప్ సింగ్.. ఇతరులను రక్షించే ప్రయత్నం చేసినట్టు యార్డులో పని చేసే ఓ ఉద్యోగి తెలిపాడు. అంతేకాకుండా తప్తేజ్‌దీప్ సింగ్‌ను హీరోగా అభివర్ణించాడు. కాగా.. తప్తేజ్‌దీప్ సింగ్ ఇండియాలో జన్మించినప్పటికీ.. కాలిఫోర్నియాలో పెరిగారు. అతనికి భార్య, మూడేళ్ల కుమారుడితోపాటు ఏడాది పాప ఉన్నారు. 

click me!